MoviesMAA Elections 2021: నాగ‌బాబును టార్గెట్ చేసిన న‌రేష్‌

MAA Elections 2021: నాగ‌బాబును టార్గెట్ చేసిన న‌రేష్‌

మా ఎన్నిక‌ల హ‌డావిడి మామూలుగా లేదు. నిన్న‌టికి నిన్న ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ ప్రెస్ మీట్ పెట్టింది. ఇక ఈ రోజు మా తాజా మాజీ అధ్య‌క్షుడు న‌రేష్ ప్రెస్ మీట్ పెట్టారు. నాగ‌బాబు నిన్న చేసిన వ్యాఖ్య‌ల‌ను న‌రేష్ త‌ప్పు ప‌ట్టారు. నాగ‌బాబు త‌న‌కు మంచి మిత్రుడే అని.. అత‌డితో తాను క‌లిసి ప‌నిచేశాన‌ని న‌రేష్ చెప్పారు. మా లో తాము చేసిన కార్య‌క్ర‌మాలు చిరంజీవి, నాగ‌బాబుకు చెప్పామ‌న్న న‌రేష్‌.. మా ప్ర‌తిష్ట మ‌స‌క బారింద‌ని నాగ‌బాబు అన‌డం ఆవేద‌న‌కు గురి చేసింద‌న్నారు.

త‌న‌కు క‌థ‌లు చెప్పే అల‌వాటు ఎప్పుడూ లేద‌ని.. కాగితాల‌తో రావ‌డ‌మే అల‌వాటు అని న‌రేష్ చెప్పారు. తాను మాలో ఆరేళ్ల నుంచి కొన‌సాగుతున్నాన‌ని.. తానేంటో, త‌న వ్య‌క్తిత్వం ఏంటో అంద‌రికి తెలుస‌ని న‌రేష్ అన్నారు. తాను ఎవ‌రినో దూషించేందుకో… ఎవ‌రిపైనో కాలు దువ్వేందుకే ఈ స‌మావేశం పెట్ట‌లేద‌ని.. న‌రేష్ అంటే ఏంటో చెప్పుకోవాల్సిన అవ‌స‌రం కూడా త‌న‌కు లేద‌ని అన్నారు. తాను మా బిడ్డ‌ను అని.. సినిమా ప‌రిశ్ర‌మ‌కు ఎప్పుడు ? ఏ ఇబ్బంది వ‌చ్చినా కూడా త‌మ కుటుంబం ఎప్పుడూ ముందు ఉంటుంద‌న్నారు.

ఇక ప్ర‌కాష్ రాజ్ త‌న‌కు మంచి మిత్రుడే అని.. ఆయ‌న మూడు నెల‌ల క్రిత‌మే త‌న‌కు ఫోన్ చేశార‌ని .. మా ఎన్నిక‌ల్లో ఎవ‌రికి అయినా పోటీ చేసే హ‌క్కు ఉంటుంద‌ని న‌రేష్ తెలిపారు. ఇక మంచు విష్ణు.. ఇండస్ట్రీ బిడ్డ.. కష్టనష్టాలు చూడకుండా సినిమాలు చేస్తూ ఎంతో మందికి అన్నం పెడుతున్నాడ‌ని న‌రేష్ చెప్పారు. ఏదేమైనా న‌రేష్ నాగ‌బాబును టార్గెట్ చేస్తూనే విష్ణుకు త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని చెప్ప‌క‌నే చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news