Moviesకంటతడి పెట్టిస్తున్న కౌశల్ పోస్ట్.. అసలు ఏమైదంటే..??

కంటతడి పెట్టిస్తున్న కౌశల్ పోస్ట్.. అసలు ఏమైదంటే..??

కౌశల్‌ మండా..బిగ్ బాస్ రెండో సీజన్ విజేతగా ఎంతటి ఫాలోయింగ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ విన్నర్‌గా కంటే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా కౌశల్ పాపులర్ అయ్యారు అన్నది నిజం.  అదీ కాకుండా కౌశల్ ఆర్మీ సభ్యులు కొందరు తిరగబడటంతో కౌశల్ వ్యవహారం మరింతగా ముదిరిపోయింది. అలా కౌశల్ చుట్టూ ఎప్పుడూ వివాదాలు ఉండటంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యేవారు.

ఆ కాంట్రవర్సీని కాసేపు పక్కన పెడితే.. నేడు ఉదయ్ కిరణ్ జయంతి. తెలుగు ఇండస్ట్రీకి దూసుకొచ్చిన తారాజువ్వ ఉదయ్ కిరణ్. వరస విజయాలతో అప్పట్లో సంచలనం సృష్టించాడు ఈ హీరో. ‘చిత్రం’ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఉదయ్ ఆ తర్వాత ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ సినిమాలతో హ్యాట్రిక్ పూర్తిచేశాడు.

‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను, ముఖ్యంగా యూత్‌ని ఆకట్టుకుని లవర్ బాయ్, చాక్లెట్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సరికొత్త సంచలనాలకు తెర తీశాడు ఉదయ్ కిరణ్. కానీ ఉదయ్ కిరణ్ కెరీర్ మాత్రం ఉన్నట్టుండి తలకిందులైపోయింది. సూపర్ స్టార్‌గా ఎదుగుతాడు అనుకున్న ఉదయ్ కిరణ్ 2014 జనవరి 5న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

నేడు ఉదయ్ కిరణ్ జయంతి. ఈ సందర్భంగా సినీ అభిమానులు, సెలెబ్రిటీలు ఆయన్ను తలుచుకుంటున్నారు. ఫ్రెండ్స్, సినిమా ఇండస్ట్రీ వారు సోషల్ మీడియా వేదికగా ఉదయ్ కిరణ్‌తో తమకున్న అనుంబంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తున్నారు.. ఈ క్రమంలో ఆయనతో కలిసి నటించిన కౌశల్ ఎమోషనల్ అయ్యారు.

 

“నా ప్రియమైన స్నేహితుడు ఉదయ్ కిరణ్ .. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నేను నిన్ను మిస్ అవ్వని క్షణం అంటూ ఉండదు. మనిద్దరం కలిసి ఉన్న రోజులను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాను. నీతో ఉన్నక క్షణాల్లో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. నా కెరీర్‌లో 8 చిత్రాల్లో నీతో కలిసి నటించాను.. అది ఎంతో సంతోషంగా ఉంది’ అని ఉదయ్ కిరణ్‌ను తలుచుకుంటూ కౌశల్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news