Moviesపూజ వ‌ద్దు బాబోయ్ అంటోన్న తార‌క్ ఫ్యాన్స్‌... రీజ‌న్ ఇదే..!

పూజ వ‌ద్దు బాబోయ్ అంటోన్న తార‌క్ ఫ్యాన్స్‌… రీజ‌న్ ఇదే..!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో బాగా డిమాండ్ ఉన్న హీరోయిన్ల‌లో ర‌ష్మిక మంద‌న్న‌, పూజా హెగ్డే మాత్ర‌మే. ఈ ఇద్ద‌రు హీరోయిన్లు కోసం స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వ‌ర‌కు పోటీ ప‌డుతున్నారు. కొంద‌రు స్టార్ హీరోలు అయితే త‌మ సినిమాల్లో పూజ‌కు వ‌ర‌స పెట్టి ఆఫ‌ర్లు ఇస్తున్నారు. దీంతో వీరిద్ద‌రు త‌మ రెమ్యున‌రేష‌న్ పెంచేయ‌డంతో పాటు కొండెక్కి కూర్చొంటున్నారు. పూజ ఇప్ప‌ట‌కే మ‌హేష్‌, తార‌క్‌, బ‌న్నీతో న‌టించింది. చెర్రీతోనూ స్పెష‌ల్ సాంగ్‌లో ఆడిపాడింది.

 

ఎన్టీఆర్‌తో అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమాలో న‌టించిన పూజా ఈ సంక్రాంతికి బ‌న్నీతో అల వైకుంఠ‌పురంలో న‌టించి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టింది. బ‌న్నీతో ఆమె డీజే సినిమాతో కూడా మెప్పించింది. ఇక తార‌క్ ఆర్ ఆర్ ఆర్ సినిమా త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో మ‌రో సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో కూడా పూజా హెగ్డేను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచ‌న‌లో త్రివిక్ర‌మ్ ఉన్నాడ‌ట‌.

 

అయితే తార‌క్ ఫ్యాన్స్ మాత్రం పూజ‌ను తార‌క్ ప‌క్క‌న ఊహించుకోలేమ‌ని.. అర‌వింద స‌మేత‌లోనే పూజ‌ను చూడ‌లేక‌పోయామ‌ని… ఆమెను మాత్రం హీరోయిన్‌గా తీసుకోవ‌ద్ద‌ని సోష‌ల్ మీడియాలో త్రివిక్ర‌మ్‌కు మెసేజ్‌లు పెడుతున్నారు. వాస్త‌వానికి అరవింద‌లో ఆమె తార‌క్ ప‌క్క‌న అంత‌గా మెప్పించ‌లేక‌పోయింది. ఆమె క్యారెక్ట‌ర్ కూడా పండ‌లేదు. మ‌రి ఈ సారి త్రివిక్ర‌మ్ ఏ హీరోయిన్‌ను తార‌క్ కోసం సెట్ చేస్తాడో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news