Moviesఈ తెలుగు న‌టి మొద‌టి భ‌ర్త‌తో విడాకులు తీసుకుందా... రెండో భ‌ర్త...

ఈ తెలుగు న‌టి మొద‌టి భ‌ర్త‌తో విడాకులు తీసుకుందా… రెండో భ‌ర్త పెద్ద విల‌న్ తెలుసా..!

తెలుగు అమ్మాయి అయిన పూజా రామ‌చంద్ర‌న్ హీరోయిన్ అవుదామ‌ని ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది. అయితే ఇక్క‌డ ఆమెకు హీరోయిన్ ఛాన్సులు రాక‌పోవ‌డంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా సెటిల్ అయ్యింది. ఓ ప్ర‌ముఖ యూట్యూబ్ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో ఆమె త‌న మొద‌టి భ‌ర్త‌తో విడిపోవ‌డానికి గ‌ల కార‌ణాలు చెప్పింది. ఆమె మొద‌టి భ‌ర్త ఓ మ్యూజిక్ ఛానెల్లో ప‌నిచేసే వాడ‌ట‌. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించ‌డంతో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్ల‌య్యాక వారి మ‌ధ్య అభిప్రాయ బేధాలు రావ‌డంతో విడిపోయామ‌ని పూజ చెప్పింది.

Pooja Ramachandran In Bigg Boss 2

ఆ త‌ర్వాత ఆమె తెలుగులో ప‌లు సినిమాల్లో విల‌న్‌గా న‌టించిన జాన్ కొక్కెన్‌ను పెళ్లాడింది. ఈ క్ర‌మంలోనే తాము ముందుగా ఒక‌రినొక‌రు అర్థం చేసుకున్నాకే పెళ్లి చేసుకున్నామ‌ని పూజ తెలిపింది. ప్ర‌స్తుత ఆమె క‌రోనా కార‌ణంగా షూటింగులు లేక‌పోవ‌డంతో ఇంటి ద‌గ్గ‌రే ఉంటోంది. యోగా, వ్యాయామం, ఫిట్‌నెస్ లాంటి ఫొటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తోంది.

Tag - Zee Cinemalu Official Website: Zee Cinemalu Watch Full Videos,  Gallery online at http://www.zeecinemalu.com

ఇక పూజ ఈ సంక్రాంతికి వ‌చ్చిన క‌ళ్యాణ్ రామ్ ఎంత‌మంచి వాడ‌వురా సినిమాలో ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లోనే న‌టించింది. అయితే ఈ సినిమా అంత‌గా ఆక‌ట్టుకోలేదు. దీంతో ఆమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఏదేమైనా పూజ ఇక్క‌డ మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news