MoviesR R R కు 9 నెంబ‌ర్‌కు ఉన్న లింక్ ఏంటో...

R R R కు 9 నెంబ‌ర్‌కు ఉన్న లింక్ ఏంటో తెలుసా… !

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబోలో ఆర్ ఆర్ ఆర్ సినిమా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. బాహుబలి 1, 2 సినిమాల త‌ర్వాత రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇండియ‌న్ సినిమా ప‌రిశ్ర‌మ‌లోనే కాకుండా ప్ర‌పంచంలో ప‌లు దేశాల్లో సినీ ప్రియులు కూడా ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి రాజ‌మౌళి ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడు.

Jr NTR's action scene from RRR movie leaked; Check viewers response to  video of Rajamouli film - IBTimes India

ఇప్ప‌టికే రామ్‌చ‌ర‌ణ్ లుక్‌కు సంబంధించి టీజ‌ర్ రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్ టీజ‌ర్ కోసం ఆయ‌న అభిమానులు క‌ళ్లు ఎర్ర‌బ‌డేలా నిద్ర‌పోకుండా ఎప్పుడు టీజ‌ర్ వ‌దులుతారా ? అన్నంత ఆతృత‌తో వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ టీజ‌ర్ అప్‌డేట్ వ‌చ్చేసింది. ఈ టీజ‌ర్ అక్టోబ‌ర్ 22న రిలీజ్ చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ తేదీ ( 22+10+2020=9) ఈ మొత్తం కలిపితే వ‌చ్చే నెంబ‌ర్ = 9. అలాగే రామ‌రాజు టీజ‌ర్ రిలీజ్ చేసిన డేట్ చూస్తే ( 27+05+2020 = 9 ) ఈ నెంబ‌ర్లు క‌లిపితే వ‌చ్చేది కూడా 9.

Alia Bhatt, Ajay Devgn roped in for Rajamouli's RRR; film releases on 30  July, 2020

R R R ను తీసుకుంటే ఆర్ నెంబ‌ర్ 18, ఈ లెక్క‌న 18 + 18 + 18 = 54 అంటే 5 + 4 = 9. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి రిలీజ్ చేసిన బైక్ నెంబ‌ర్ 1+9+7+1 = 9 కాగా, కారు నెంబ‌ర్ 6 + 1 + 7 = 9 అయ్యింది. ఇలా ఈ సినిమాకు సంబంధించి ఏ అంశం చూసుకున్నా 9 నెంబ‌ర్‌తోనే ముడిప‌డి ఉంది. రేపు ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా 9గానే ప్ర‌కటిస్తార‌న్న చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news