Newsప్ర‌ధాని మోడీ ఆస్తుల లెక్క‌లివే.. సామాన్య జీవిత‌మే...!

ప్ర‌ధాని మోడీ ఆస్తుల లెక్క‌లివే.. సామాన్య జీవిత‌మే…!

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ త‌న ఆస్తుల వివ‌రాలు వెల్ల‌డించారు. గ‌తంతో పోలిస్తే ఆయ‌న ఆస్తుల విలువ రు. 36. 53 ల‌క్ష‌లు పెరిగాయి. ఇక గాంధీన‌గ‌ర్లో ఉన్న ఇళ్లు, స్థ‌లం, ఆయ‌న‌కు బాండ్లు, ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో ఉన్న డ‌బ్బులు వివ‌రాలు కూడా వెల్ల‌డించారు. 15 నెల‌ల క్రితం చూస్తే మోడీ స్థిర‌, చ‌రాస్తుల విలువ మొత్తం రు. 1,39,10,260 ఉండగా తాజాగా ప్రకటించిన దాని ప్రకారం ఆస్తుల విలువ 1,75,63,618 కి గా ఉన్నది.

 

మోడీకి ఎంపీగా, ప్ర‌ధానిగా వ‌స్తోన్న జీతాన్ని మాత్రం ఫిక్స్ డ్ డిపాజిట్ రూపంలో ఫిక్స్ చేస్తున్నారు. దీని మీద వ‌చ్చే వ‌డ్డీని సైతం ఫిక్స్ డ్ డిపాజిట్ రూపంలో ఉంచుతున్నారు. ఇక మోడీ పొదుపు ఖాతాలో రు 3.38 ల‌క్ష‌లు ఉండ‌గా, న‌గ‌దుగా మ‌రో రు. 31,450 ఉంది. మోడీ కూడా ఓ సామాన్యుడి జీవితం గ‌డుపుతున్నాడ‌ని ఆయ‌న ఆస్తులే చెపుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news