Moviesడ్ర‌గ్ ఉచ్చులో వివేక్ ఒబేరాయ్... ఊహించ‌ని షాక్ ఇచ్చిన పోలీసులు

డ్ర‌గ్ ఉచ్చులో వివేక్ ఒబేరాయ్… ఊహించ‌ని షాక్ ఇచ్చిన పోలీసులు

దివంగ‌త బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో డ్రగ్స్ ప్రకంపనలు ప‌లువురు స్టార్ల‌కు చెమ‌ట‌లు పుట్టిస్తున్నాయి. అరెస్టు అయిన సుశాంత్ ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తి ప‌లువురు సెల‌బ్రిటీల పేర్లు లీక్ చేయ‌డంతో ఎన్సీబీ అధికారులు వ‌రుస‌గా బాలీవుడ్ సెల‌బ్రిటీల‌ను టార్గెట్‌గా చేసుకుని దాడులు చేస్తూ ఈ గుట్టు అంతా ర‌ట్టు చేస్తున్నారు. ఇప్ప‌టికే రకుల్ ప్రీత్ సింగ్‌, దీపికా పదుకొణే, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ తదితరులని ఎన్సీబీ విచారించింది.

 

ఇక గురువారం మ‌రో బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబేరాయ్ ఇంట్లో బెంగళూరు పోలీసులు సోదాలు జరిపారు. ఇప్ప‌టికే వివేక్ బంధువు ఆదిత్య అల్వాకు డ్ర‌గ్స్ కేసులో లింకులు ఉన్న విష‌యం బ‌య‌ట‌కు రావ‌డ‌తో ఆయ‌న కోసం కూడా పోలీసులు ముమ్మ‌రంగా గాలిస్తున్నారు. ఇక వివేక్ ఇంట్లో సోదాల కోసం క్రైం బ్రాంచ్ టీం కోర్టు వారెంట్ తీసుకుని మ‌రీ ముంబైలోని వివేక్ ఇంట్లో సోదాలు చేశారు. పోలీసులు ఇచ్చిన ఊహించని షాక్‌తో వివేక్ తీవ్ర ఆందోళ‌న‌తో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news