Gossipsకోన వెంక‌ట్‌కు బ్రేక‌ప్ చెప్పేశారా... టాలీవుడ్ హాట్ టాపిక్‌..!

కోన వెంక‌ట్‌కు బ్రేక‌ప్ చెప్పేశారా… టాలీవుడ్ హాట్ టాపిక్‌..!

ర‌చ‌యిత కోన వెంక‌ట్ హ‌వా గ‌తంలో టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో ఉండేది. కోన వెంక‌ట్ – గోపీ మోహ‌న్ క‌లిశారంటే చాలు ఆ సినిమా సూప‌ర్ హిట్టే. వివి. వినాయ‌క్‌, శ్రీను వైట్ల లాంటి డైరెక్ట‌ర్ల‌కు స్టార్ ఇమేజ్ రావ‌డంలో కోన వెంక‌ట్ ఎంతో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌ర్వాత వినాయ‌క్‌కు దూరం జ‌రిగిన వీళ్లు శ్రీను వైట్ల‌తో ట్రావెల్ చేశారు. త‌ర్వాత శ్రీను వైట్ల‌కు కోన వెంక‌ట్‌కు మ‌ధ్య పొస‌గ‌క పోవ‌డంతో వీరు కూడా విడిపోయారు. బ్రూస్ లీ సినిమా కోసం అయిష్టంగా క‌లిసినా మ‌ళ్లీ ఎవ‌రి దారి వారిదే అయ్యింది.

 

ఇక ఆ త‌ర్వాత కోన నిర్మాణంలో కొన్ని సినిమాలు తెర‌కెక్కినా వాటిల్లో చాలా వ‌ర‌కు ఫ‌ట్టే అయ్యాయి. ఇక ఇప్పుడు ఆయ‌న పెన్ను ప‌దును పూర్తిగా త‌గ్గిపోయింది. ఇప్పుడు తెలివిగా డ‌బ్బులు పెట్టుబ‌డిగా పెట్ట‌కుండా త‌న మాట‌లు, రాత‌ల‌తో కాంబినేష‌న్లు సెట్ చేస్తూ సినిమాలో వాటాలు ద‌క్కించుకుంటున్నాడు. ఇక తాజాగా వచ్చిన అనుష్క నిశ్శ‌బ్దం సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి డిజాస్ట‌ర్ టాక్ సొంతం చేసుకుంది.

 

ఇక కోన చెప్పే మాట‌లు గుడ్డిగా నమ్మేస్తూ ఆయ‌న‌తో ట్రావెల్ చేస్తోన్న పీపుల్స్ మీడియా ఇక నుంచి ఆయ‌న‌తో బ్రేక‌ప్ కు సిద్ధ‌మ‌వుతోంద‌న్న వార్త‌లు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. నిశ్శ‌బ్దం అన్ని భాష‌ల్లోనూ అట్ట‌ర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. మ‌రోవైపు పండ‌గ చేస్కో సినిమా త‌ర్వాత ఇన్నేళ్ల‌లో మ‌నోడికి ఒక్క హిట్ కూడా లేదు. ఈ క్ర‌మంలోనే కోన‌తో కలిసి కొన‌సాగలేమ‌ని డిసైడ్ అయిన ఈ సినిమా వ‌ర్గాలు విడిపోయిన‌ట్టు టాక్‌..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news