Moviesగౌత‌మి మొద‌టి భ‌ర్త ఎవ‌రో తెలుసా... ఎందుకు విడిపోయిందంటే...!

గౌత‌మి మొద‌టి భ‌ర్త ఎవ‌రో తెలుసా… ఎందుకు విడిపోయిందంటే…!

సీనియ‌ర్ న‌టి గౌత‌మి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. 1980 – 90 వ‌ద‌శ‌కంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఎంతో మంది సీనియ‌ర్ హీరోలు, స్టార్ హీరోల‌తో న‌టించిన ఆమె త‌న అందం, అభిన‌యంతో ప్రేక్ష‌కుల మ‌దిలో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. గౌత‌మి సినిమాల్లో న‌టించి వైవాహిక జీవితంలో స్థిర‌ప‌డ్డాక ఆమెను అంద‌రూ మ‌ర్చిపోయారు. అయితే ఆమె తిరిగి క‌మ‌ల్ హాస‌న్‌తో స‌హ‌జీవ‌నం చేస్తూ వార్త‌ల్లో హాట్ టాపిక్ అయ్యారు. క‌మ‌ల్ – గౌత‌మి స‌హ‌జీవ‌నం పీక్స్ గా ఉన్న‌ప్పుడు శృతీహాస‌న్ పెత్త‌నం ఎక్కువ అవ్వ‌డం.. క‌మ‌ల్ ఈ విష‌యంలో గౌత‌మి కంటే శృతీకే స‌పోర్ట్ చేయ‌డంతో గౌత‌మి క‌మ‌ల్‌కు దూర‌మైంది.

 

ఇక క‌మ‌ల్ – గౌత‌మితో స‌హ‌జీవ‌నం చేయ‌డానికి ముందే రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. వాణీ గ‌ణ‌ప‌తి క‌మ‌ల్ మొద‌టి భార్య‌. ఆ త‌ర్వాత ఆమె త‌న హీరోయిన్ సారిక‌ను పెళ్లాడాడు. ఈ దంప‌తుల పిల్ల‌లే శృతీ, అక్ష‌ర హాస‌న్‌లు. ఇక గౌత‌మి సినిమాల్లో ఉండ‌గానే సందీప్ భాటియాను పెళ్లాడింది. క‌మ‌ల్‌కు ఆమె ద‌గ్గ‌ర కావ‌డంతో ఆమె భ‌ర్త‌కు విడాకులు ఇవ్వ‌క త‌ప్ప‌లేదు. త‌న విడాకుల విష‌యంపై గౌత‌మి త‌న తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లి అయిన ఇద్ద‌రు విడిపోతున్నారంటూ అందులో ఇద్ద‌రి త‌ప్పు ఉంటుంద‌ని చెప్పింది.

 

తాను, త‌న భ‌ర్త సందీప్ ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే విడిపోయిన‌ట్టు చెప్పింది. ఇక తాను క్యాన్స‌ర్ భారీన ప‌డిన‌ప్ప‌ట‌కి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంతో పాటు త‌న త‌ల్లిదండ్రులు ఇద్ద‌రు వైద్య వృత్తిలో ఉన్న‌వారు కావ‌డంతో తాను త్వ‌ర‌గా కోలుకున్నాన‌ని గౌత‌మి చెప్పింది. ఇక గౌత‌మి ప్ర‌స్తుతం త‌న కుమార్తెతో క‌లిసి చెన్నైలో ఉంటోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news