Moviesప‌త్తా లేకుండా పోయిన ర‌వితేజ మ‌ర‌ద‌ల‌ను గుర్తు ప‌ట్టారా...!

ప‌త్తా లేకుండా పోయిన ర‌వితేజ మ‌ర‌ద‌ల‌ను గుర్తు ప‌ట్టారా…!

చాలా మంది హీరోయిన్లు ఎన్నో ఆశ‌లు, అంచ‌నాల‌తో ఇండ‌స్ట్రీలో హీరోయిన్లు అవుదామ‌ని వ‌స్తారు. అయితే వీరిలో కొంద‌రికి మాత్ర‌మే మంచి ఛాన్సులు రావ‌డంతో పాటు స్టార్ హీరోయిన్లు అయ్యే ల‌క్కీ ఛాన్స్ వ‌స్తుంది. కొంద‌రు మాత్రం ఒక‌టీ ఆరా సినిమాల‌కే ప‌త్తా లేకుండా పోతారు. ఇలాంటి హీరోయిన్ల లిస్ట్ చాలానే ఉంటుంది. వీళ్ల‌లోకే వ‌స్తుంది కిక్ సినిమాలో న‌టించిన అశీక భ‌జిత‌. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ హీరోగా వ‌చ్చిన కిక్ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది.

 

ఈ సినిమాలో ర‌వితేజ ల‌వ‌ర్‌గా ఇలియానా న‌టిస్తే ఇలియానా చెల్లిగా అశీక భ‌జిత నటించింది. ఆ సినిమాలో ఆమె ఇన్నోసెంట్‌గా ఉన్నా ఆమెను పెద్ద‌గా ఎలివేట్ చేయ‌క‌పోవ‌డంతో ఆమె క్యారెక్ట‌ర్‌కు గుర్తింపు లేకుండా పోయింది. ఈ సినిమా త‌ర్వాత ఆమె తెలుగులో ఏ సినిమాలో న‌టించ‌లేదు.. ఎక్క‌డా క‌నిపించ‌లేదు. చాలా యేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఈ ర‌వితేజ మ‌ర‌ద‌లు పాప గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

 

 

ఆశీక కిక్ సినిమాలో న‌టించాక తిరిగి ముంబైలో కొద్ది రోజులు ఉండి లండ‌న్ చెక్కేసింద‌ట‌. ఇప్పుడు ఆమె న్యూయార్క్‌లో ఉంటుంద‌ని తేలింది. ఆశీక ఇప్పుడు సినిమాల‌కు పూర్తిగా దూరం కావ‌డంతో పాటు మోడ‌లింగ్ రంగంపై కాన్‌సంట్రేష‌న్ చేస్తోంద‌ట‌. ఆమె సోష‌ల్ మీడియాలో పెద్ద‌గా యాక్టివ్‌గా లేక‌పోవ‌డంతో ఆమె గురించి ఇన్నాళ్లు ఎలాంటి స‌మాచారం బ‌య‌ట‌కు రాలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news