Moviesడ్ర‌గ్స్ కేసులో కొత్త ట్విస్ట్ రివీల్‌... హీరోయిన్ సంజ‌నా పెళ్లి గుట్టు...

డ్ర‌గ్స్ కేసులో కొత్త ట్విస్ట్ రివీల్‌… హీరోయిన్ సంజ‌నా పెళ్లి గుట్టు ర‌ట్టు

శాండల్‌వుడ్‌లో డ్రగ్స్‌ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఈ కేసులో ఇప్ప‌టికే అధికారులు ఇద్ద‌రు హాట్ హీరోయిన్లు సంజ‌నా, రాగిణి ద్వివేదిల‌ను అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజా విచార‌ణ‌లో సీసీబీ పోలీసులు కొత్త విషయం బయటపెట్టారు. ఇక త‌న‌ను అరెస్టు చేసిన‌ప్పుడు సంజ‌న త‌న‌కు పెళ్లి కాలేద‌ని చెప్పారు. మంగ‌ళ‌వారం పోలీసుల విచార‌ణ‌లో పెళ్లి ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు త‌న‌కు ఇంకా పెళ్లి కాలేద‌న్నార‌ట‌.

Actress Sanjana Galrani Married Doctor Azeez Pasha - Sakshi

అయితే యేడాది క్రితం ఆమె పెళ్లి జ‌రిగిన ఓ ఫొటో ఇప్పుడు బ‌య‌ట‌కు రావ‌డం.. అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ఆ ఫొటోను చూపడంతో ఆమె కంగుతిన్నారు. అజీజ్‌ పాషా అనే వైద్యున్ని ఆమె రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ఆమె ఒప్పుకుంద‌ని అంటున్నారు. పోలీసులు ఆమె పాషాను పెళ్లి చేసుకున్న‌ట్టు ప‌క్కా ఆధారాలు చూపించేస‌రికి సంజ‌న ఈ విష‌యం ఒప్పుకుంద‌ట‌. ఇక అంత‌కు ముందే ఆమె బెంగ‌ళూరులో ఓ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారిని పెళ్లి చేసుకోవాల‌నుకుంద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు మ‌రో స‌డెన్ ట్విస్ట్‌తో అంద‌రికి షాక్ ఇచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news