Moviesఅనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌పై ట్రోలింగ్‌.. రీజ‌న్ ఇదే

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌పై ట్రోలింగ్‌.. రీజ‌న్ ఇదే

వివాదాల‌కు దూరంగా ఉండే మ‌ళ‌యాళ కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌పై కొంద‌రు ట్రోలింగ్‌కు దిగ‌డంతో ఆమె తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌ళ‌యాళ ఇండ‌స్ట్రీకి చెందిన అనుప‌మ మ‌ళ‌యాళంలో కంటే తెలుగు, త‌మిళ్ భాష‌ల్లోనే ఎక్కువుగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అనుప‌మ మాట్లాడుతూ తాను సొంత భాష‌లో సినిమాలు చేయ‌క‌పోవ‌డానికి హ‌‌ర్ట్ అవ్వ‌డ‌మే అని చెప్పారు. త‌న తొలి సినిమా ప్రేమ‌మ్ రిలీజ్ అయ్యాక మ‌ళ‌యాళంలో కొంద‌రు కావాల‌నే దుష్ప్ర‌చారం చేయ‌డంతో పాటు త‌న‌కు పొగ‌రు అని ప్ర‌చారం చేశార‌ని ఆమె వాపోయారు.

ఆ స‌మ‌యంలో తన మ‌న‌స్సు ఎంతో గాయ‌ప‌డింద‌ని.. దాని గురించి ఆలోచ‌న చేస్తూ టైం వేస్టు చేసుకోకూడ‌ద‌నే తాను ఆ విష‌యాన్ని అక్క‌డితో వ‌దిలేసి ముందుకు సాగాన‌ని చెప్పారు. కొంద‌రు త‌న మాట‌ల‌ను వ‌క్రీక‌రిస్తూ సోష‌ల్ మీడియాలో త‌న‌పై చేసిన ప్ర‌చారంతో తాను తీవ్రంగా హ‌ర్ట్ అయ్యాన‌ని చెప్పారు. అందువ‌ల్లే ప్రేమ‌మ్ త‌ర్వాత తాను మ‌ళ‌యాళంలో సినిమాలు చేయ‌కూడ‌ద‌ని గ‌ట్టిగా నిర్ణ‌యం తీసుకున్నాన‌న్నారు.

ప్రేమ‌మ్ త‌ర్వాత అక్క‌డ మంచి ఛాన్సులే వ‌చ్చినా వాటిని రిజెక్ట్ చేశాన‌ని… ఇక్క‌డ తెలుగు, త‌మిళ్ సినిమాల‌కే ప్రాధాన్యం ఇస్తున్నాన‌ని అనుప‌మ చెప్పారు. ఇక త‌న‌పై ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్టుగా తానేమి అహంకారిని కాద‌ని ఆమె తేల్చి చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news