Moviesవిరుష్క దంప‌తుల క్రేజ్ ఇది.. ఒక్క ఫొటోకు అన్ని లైకులా.. ఆసియా...

విరుష్క దంప‌తుల క్రేజ్ ఇది.. ఒక్క ఫొటోకు అన్ని లైకులా.. ఆసియా రికార్డు

భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అత‌డి భార్య అనుష్క‌ను దేశ‌వ్యాప్తంగా ఉన్న వీరి అభిమానులు ముద్దుగా విరుష్క‌గా పిలుచుకుంటారు. పెళ్లికి ముందు వీరు డేటింగ్లో ఉన్న‌ప్ప‌టి నుంచే వీరికి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ జంట సోష‌ల్ మీడియాలో త‌మ గురించి ఏ చిన్న పోస్ట్ పెట్టినా, ఫోటో పెట్టినా దుమ్ము రేగిపోయేలా వైర‌ల్ అవుతోంది. తాజాగా కోహ్లీ త‌న భార్య త‌ల్లి కాబోతుంద‌ని.. ఆమె ప్ర‌స్తుతం ప్రెగ్నెంట్ అంటూ రెండు రోజుల క్రిత‌మే ఓ ఫొటో షేర్ చేశాడు.

తామిద్ద‌రం ముగ్గురుం కాబోతున్నామ‌ని కూడా కోహ్లీ చెప్పాడు. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో అలా పెట్టాడో లేదో రికార్డు స్థాయిలో లైకులు, కామెంట్ల వ‌ర్షం కురిసింది. అయితే ఇప్పుడు ఈ ఫొటో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసింది. కోహ్లీ ఇన్‌స్టా నుంచి వ‌చ్చిన ఈ ఫొటోకు ఏకంగా కోటి లైకులు వ‌చ్చాయి. కేవ‌లం ఒకే ఒక్క పోస్టుతో కోటి లైకులు సొంతం చేసుకున్న ఆసియా వ్య‌క్తిగా కోహ్లీ రికార్డుల‌కు ఎక్కాడు.

ఇక ప్ర‌స్తుతం కోహ్లీ ఐపీఎల్ ఆడేందుకు ఆబుదాబీ వెళ్లాడు. ఈ సారి ఎలాగైనా రాజ‌స్థాన్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌కు ట్రోఫీ అందించాల‌ని కోహ్లీ ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. సెప్టెంబ‌ర్ 19నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news