Gossipsకాజ‌ల్ సీక్రెట్ ఎంగేజ్‌మెంట్‌... వ‌రుడు ఎవ‌రంటే...!

కాజ‌ల్ సీక్రెట్ ఎంగేజ్‌మెంట్‌… వ‌రుడు ఎవ‌రంటే…!

చంద‌మామ కాజ‌ల్ ముదురు ముద్దుగుమ్మ‌గా మారినా కూడా ఇప్ప‌ట‌కీ సినిమా ఛాన్సుల‌కు మాత్రం కొద‌వ‌లేదు. మెగాస్టార్ లాంటి సీనియ‌ర్ హీరోల‌కు ఇప్పుడు ఆమె మంచి ఆప్ష‌న్‌గా మారింది. చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150లో హీరోయిన్‌గా న‌టించిన కాజ‌ల్ ఇప్పుడు మ‌ళ్లీ అచార్య సినిమాలో కూడా చిరుతో జోడీ క‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. కాజ‌ల్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి అప్పుడే 12 సంవ‌త్స‌రాలు దాటేశాయి. కాజ‌ల్ చెల్లి నిషా అగ‌ర్వాల్ అప్పుడే పెళ్లి చేసుకుని పిల్ల‌ల‌కు జ‌న్మ‌కూడా ఇచ్చింది.

 

ప్ర‌స్తుతం కరోనా వేళ సినిమా వాళ్లు వ‌రుస పెట్టి పెళ్లి పీట‌లు ఎక్కుతున్నారు. ఇటీవ‌లే ఆమె ఎంగేజ్మెంట్ సీక్రెట్‌గా జ‌రిగింద‌ని అంటున్నారు. ఆమెకు కాబోయే భ‌ర్త గౌతం… అని అత‌డు పెద్ద బిజినెస్‌మేన్ అని అంటున్నారు. ప్ర‌స్తుతం ఆమెకు ఉన్న క‌మిట్‌మెంట్లు కంప్లీట్ అయ్యాక ఆమె పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయ్యే ఆలోచ‌న‌లో ఉంద‌ని అంటున్నారు. అయితే కాజ‌ల్ పెళ్లి డేట్ ఎప్పుడు అనేది మాత్రం రివీల్ కావ‌డం లేదు.

 

ఆమె ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో క‌మ‌ల్ ప‌క్క‌న ఇండియ‌న్ 2 సినిమాలో న‌టిస్తోంది. అలాగే తెలుగులో మెగాస్టార్ తో ఆచార్యలో ఆమె నటిస్తోంది. తేజా డైరెక్షన్లో వస్తున్న అలివేలు మంగ మూవీలో కూడా కాజల్ హీరోయిన్ అంటున్నారు. మ‌రి ఇవి కంప్లీట్ చేసి పెళ్లి పీట‌లు ఎక్కుతుందా ? ముందు మూడు ముళ్లు వేయించుకుంటుందా ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news