Gossipsమ‌రో బయోపిక్ రెడీ... శ్రీహ‌రి బ‌యోపిక్‌కు క‌థ రెడీ చేసిన డిస్కోశాంతి

మ‌రో బయోపిక్ రెడీ… శ్రీహ‌రి బ‌యోపిక్‌కు క‌థ రెడీ చేసిన డిస్కోశాంతి

టాలీవుడ్‌లో ఇప్పుడు అంతా బ‌యోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. దివంగ‌త మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన‌ప్ప‌టి నుంచి ప‌లువురు బ‌యోపిక్‌ల‌ను తెర‌కెక్కించే ప‌నిలో ఉన్నారు. ఓ వైపు జాతీయ స్థాయిలో వ‌చ్చిన ధోనీ బ‌యోపిక్ హిట్ అవ్వ‌డం.. ఇక ఎన్టీఆర్ బ‌యోపిక్‌లు, వీర‌ప్ప‌న్ బ‌యోపిక్‌లు ఇలా వ‌రుస‌గా బ‌యోపిక్‌ల హ‌వా న‌డుస్తోంది. అయితే తెర‌కెక్కించిన అన్నీ బ‌యోపిక్‌లు హిట్ అవుతాయ‌న్న గ్యారెంటీ లేక‌పోయినా బయోపిక్‌ల విష‌యంలో ఓ ఆశ ఉంది.

 

ఇక ఇప్పుడు దివంగ‌త న‌టి విజ‌య‌నిర్మ‌ల బ‌యోపిక్ తెర‌కెక్కించేందుకు కుమారుడు న‌రేష్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. త‌న త‌ల్లి జీవిత చ‌రిత్ర‌ను చరిత్ర‌లో నిలిచిపోయేలా తెర‌కెక్కించే ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌రో బ‌యోపిక్‌కు రెడీ అవుతోంద‌ట‌. దివంగ‌త న‌టుడు శ్రీహ‌రి బ‌యోపిక్ తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. ఈ బ‌యోపిక్‌కు సంబంధించిన మెయిన్ లైన్‌ను శ్రీహ‌రి భార్య డిస్కోశాంతి రెడీ చేసింద‌ని… ఇందుకోసం ఆమె ఓ ద‌ర్శ‌కుడితో కూడా చ‌ర్చ‌లు జ‌రుపుతోంద‌ని అంటున్నారు.

 

ఈ బ‌యోపిక్‌లో శ్రీహ‌రి త‌న‌యుల‌తో పాటు డిస్కోశాంతి కూడా ఓ పాత్ర‌లో న‌టించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అయితే శ్రీహ‌రి పాత్ర‌కు ఆయ‌న త‌న‌యులే న‌టిస్తారా ? లేదా ? మ‌రో హీరో చేస్తాడా ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news