Moviesఅత‌డితో ప్రేమ నిజ‌మే.. ఆండ్రియా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అత‌డితో ప్రేమ నిజ‌మే.. ఆండ్రియా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

గ‌త మూడు నాలుగేళ్లుగా ఇండ‌స్ట్రీకి సంబంధించి ర‌క‌ర‌కాల ప్రేమ వార్త‌లు, ర‌క‌ర‌కాల లీకులు బాగా ఎక్కువ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే సుచీలిక్స్‌లో ప్ర‌ముఖంగా వినిపించిన పేరు సింగ‌ర్ కం హీరోయిన్ ఆండ్రియా జెరోమియా. ఆమె సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌కు ఎంత క్లోజో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ‌తంలో ఆమె అనిరుధ్‌ను గట్టిగా లిప్‌లాక్ చేస్తోన్న ఫొటోలు బాగా వైర‌ల్ అయ్యాయి. అప్ప‌ట్లోనే వీరి మ‌ధ్య ఏదో న‌డిచింద‌న్న గుస‌గుస‌లు కూడా బాగా ఎక్కువ అయ్యాయి.

 

ఏదేమైనా అప్ప‌ట్లో వీరిద్ద‌రి రిలేష‌న్ వ్య‌వ‌హారం మాత్రం పెద్ద సంచ‌ల‌న‌మే అయ్యింది. వీరి లిప్‌లాక్ ఫొటోలు ఎంత ఘాటుగా బ‌య‌ట‌కు వ‌చ్చినా కూడా అనిరుధ్‌, ఆండ్రియా ఇద్ద‌రు స్పందించ‌లేదు. ఈ వ్య‌వ‌హారంపై తాజాగా ఆండ్రియా ఓ ఇంట‌ర్వ్యూలో స్పందించింది. తాను అనిరుధ్‌ను ముద్దుపెట్టుకున్న మాట వాస్త‌వ‌మే అని ఆమె చెప్పింది. అయితే అప్పుడు తామిద్ద‌రం ప్రేమ‌లో ఉన్నామ‌ని… కొంద‌రు వాటిని సీక్రెట్‌గా ఫొటోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం మాత్రం త‌ప్పే అని చెప్పింది.

 

ఇలా జ‌రిగినందుకు త‌ర్వాత త‌న‌కు అనిరుధ్ క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పాడ‌ని ఆండ్రియా చెప్పింది. ఇక ఆండ్రియా గ‌తంలోనూ కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఓ వ్య‌క్తితో తాను రిలేష‌న్ షిఫ్‌లో ఉన్నాన‌ని.. కాని అత‌డు న‌న్ను మాన‌సికంగా ఎంతో టార్చ‌ర్ పెట్టాడ‌ని చెప్పింది. పైగా అత‌డు పెళ్లైన వ్య‌క్తి అని కూడా ఆండ్రియా చెప్ప‌డం అప్ప‌ట్లో పెద్ద సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news