Gossipsబ్రేకింగ్‌: నాని V సినిమా రిలీజ్ డేట్ వ‌చ్చేసింది...

బ్రేకింగ్‌: నాని V సినిమా రిలీజ్ డేట్ వ‌చ్చేసింది…

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన వీ సినిమా దాదాపు ఆరు నెల‌ల క్రిత‌మే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. మార్చి 25న రిలీజ్ కావాల్సి ఉన్న ఈ సినిమా క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. అప్ప‌టి నుంచి నాలుగైదు నెల‌లుగా రిలీజ్ కోసం వీ లైన్లోనే ఉంది. సుధీర్‌బాబు, అధితిరావు హైద‌రీ, నివేధా థామ‌స్ ఈ సినిమాలో న‌టించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమాను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయాలా ? ఓటీటీలో రిలీజ్ చేయాలా ? అన్న దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు తీవ్ర త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు జ‌రిగాయి.

 

అయితే ఎట్ట‌కేల‌కు వీ ను ఓటీటీలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యింది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. సెప్టెంబ‌ర్ 5 నుంచి దీనిని అమోజాన్ ఫ్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయ‌నున్నారు. ఏదేమైనా ఐదారు నెల‌లుగా ఓ పెద్ద హీరో సినిమా కూడా రిలీజ్ కాక‌పోవ‌డంతో సినిమా కోసం మొఖం వాచిపోయి ఉన్న తెలుగు సినిమా అభిమానుల‌కు మొత్తానికి నాని వీ రూపంలో మంచి వీనుల విందు చేయ‌నున్నాడు. మ‌రి వి రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news