Gossipsప్ర‌భాస్ ఆదిపురుష్‌లో విల‌న్ పేరు లీక్‌.. ఆ స్టార్ హీరోయేనా..!

ప్ర‌భాస్ ఆదిపురుష్‌లో విల‌న్ పేరు లీక్‌.. ఆ స్టార్ హీరోయేనా..!

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధేశ్యామ్ సినిమాలో నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే ప్ర‌భాస్ మ‌హాన‌టి ఫేం నాగ్ అశ్విన్ తెర‌కెక్కించే సైన్స్‌ఫిక్ష‌న్ సినిమాలో న‌టిస్తున్నాడు. వైజ‌యంతీ మూవీస్ సంస్థ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా త‌ర్వాత ఏ ఆదిపురుష్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ లో తానాజీ సినిమాను డైరెక్ట్ చేసిన ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే ఈ సినిమాను టీ సీరిస్ సంస్థ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది.

 

ఇక ఈ సినిమాలో ఎవ‌రెవ‌రు న‌టిస్తున్నారు అనే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు కూడా స్టార్ట్ అయ్యాయి. ప్ర‌భాస్ ప‌క్క‌న సీత‌గా కీర్తి సురేష్ న‌టిస్తోంద‌ని వార్తలు వ‌స్తున్నాయి. ఇక మ‌రోవైపు ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లో బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ న‌టిస్తున్నాడ‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. సైఫ్ రావ‌ణుడి పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని అంటున్నారు. అయితే దీనిపై సినిమా యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న అయితే రాలేదు.

 

సైఫ్ గ‌తంలో ఓం రౌత్ తెర‌కెక్కించిన తానాజీ సినిమాలో న‌టించాడు. ఈ నేప‌థ్యంలోనే ఈ సినిమాలో కూడా న‌టిస్తున్నాడ‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక రు. 500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కే ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తెర‌కెక్కించ‌డంతో పాటు ఐదు భాష‌ల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news