Gossipsతల్లి పాత్ర కోసం డబ్బులు లెక్క చేయని బాలయ్య..!

తల్లి పాత్ర కోసం డబ్బులు లెక్క చేయని బాలయ్య..!

ఎన్టీఆర్ బయోపిక్ సినిమాపై బాలకృష్ణ ఎంతో జాగ్రత్త వహిస్తున్నారు. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ గా బాలకృష్ణ దాదాపు 64 పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తుంది. సిని, రాజకీయ ప్రస్థావనలో ఎన్.టి.ఆర్ బయోపిక్ చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. అయితే ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ ను ఎంపిక చేశారు.

తన తల్లి పాత్ర కోసం బాలకృష్ణ ఏమాత్రం కాంప్రమైజ్ అవడం లేదట. అమెకు కోటిన్నర రెమ్యునరేషన్ ఇవ్వడంతో పాటుగా ఆ పాత్ర అనుకున్న దాని కన్నా గొప్పగా తెరకెక్కించాలని క్రిష్ తో చెప్పాడట బాలకృష్ణ. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news