Gossipsమెగాస్టార్ చిరంజీవికి చెప్పుకోలేని సమస్య..!

మెగాస్టార్ చిరంజీవికి చెప్పుకోలేని సమస్య..!

ఖైది నంబర్ 150తో పదేళ్ల తర్వాత కూడా తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని కలక్షన్స్ తో ప్రూవ్ చేశాడు. ఇక ఆ సినిమా తర్వాత 151వ సినిమాగా సైరా నరసిం హారెడ్డి సినిమా చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా 150 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది.

నవంబర్ నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. కొరటాల శివ ఫైనల్ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నాడట. ఈ సినిమాకు అంతా బాగానే ఉన్నా హీరోయిన్ విషయంలో పెద్ద సమస్య వచ్చి పడుతుందట. చిరు 60 ప్లస్ హీరో ఆయన పక్కన హీరోయిన్ గా నటించడానికి యువ హీరోయిన్స్ పనికిరారు.

ఖైది నంబర్ 150కే ఎవరిని తీసుకోవాలా అని ఫైనల్ గా కాజల్ ను సెలెక్ట్ చేశారు. ఇప్పుడు 152వ సినిమాకు హీరోయిన్ సమస్య ఏర్పడింది. మరి ఈ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్ గా ఎవరు చేస్తారో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news