Gossipsవీర రాఘవ తో చిందేయనున్న లోకల్ బ్యూటీ : తారక్ కోసం...

వీర రాఘవ తో చిందేయనున్న లోకల్ బ్యూటీ : తారక్ కోసం మరో సారి సై !!

జనతా గ్యారేజ్ సినిమాలో పక్కా లోకల్ అంటూ చిందేసిన కాజల్ మరోసారి తారక్ పక్కన స్పెషల్ సాంగ్ చేయటానికి సై అన్నదని విశ్వసనీయ సమాచారం. పక్కా లోకల్ పాట తర్వాత కాజల్ ని ఎంతమంది సంప్రదించినా ఐటెం సాంగ్ చేయని కాజల్ మరోసారి తారక్ తో చేయటానికి ఒప్పుకున్నదంటే వారి మధ్య బాండింగ్ ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక పక్కా లోకల్ లో తనకు మాత్రమే సాధ్యమైన చూపులతో , స్టెప్పులతో , అందాలతో మాయ చేసిన కాజల్ మరోసారి తమన్ వాయిద్యాలకు ఏవిధంగా మాయ చేస్తుందో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవ సినిమాకి గాను కాజల్ తో స్పెషల్ సాంగ్ చేయిస్తున్నారని సమాచారం. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలో స్పెషల్ సాంగ్స్ ని చేయడు. కానీ తారక్ కి ఉన్న మాస్ ఇమేజ్ కారణంగా ఐటెం సాంగ్ ని చాలా స్పెషల్ గా కంపోజ్ చేస్తున్నారని వినికిడి. అలాగే ఎన్టీఆర్ కాజల్ ది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తమన్ కూడా డిఫరెంట్ స్వరాలను అందించేందుకు కృషి చేస్తున్నాడని తెలిసింది. అటు అజ్ఞాతవాసి తో భారీ డిజాస్టర్ చూసిన త్రివిక్రమ్ వీర రాఘవ కి పక్కా స్క్రిప్ట్ తో వర్క్ చేస్తూ దసరా కి విడుదల చేసేందుకు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇక ఎన్టీఆర్ సరసన తొలిసారిగా పూజా హెగ్డే కథ నాయికగా నటిస్తుండగా ఈషా రెబ్బ కూడా ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news