Moviesఅక్కడ అర్జున్ రెడ్డి అదిరిపోయే రికార్డ్..!

అక్కడ అర్జున్ రెడ్డి అదిరిపోయే రికార్డ్..!

విజయ్ దేవరకొండ, షాలిని లీడ్ రోల్స్ గా సందీప్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. అంచనాలకు మించి వసూళ్లను రాబట్టడంలో సక్సెస్ అయిన అర్జున్ రెడ్డి ఓవర్సీస్ లో భారీ వసూళ్ల రాబడుతూ కొత్త రికార్డ్ సృష్టించింది. ముఖ్యంగా యూఎస్ లో ఏ సర్టిఫికెట్ వచ్చిన అర్జున్ రెడ్డి ఆదివారానికే 9 లక్షల డాలర్స్ వసూలు చేయడం రికార్డ్ అని చెప్పొచ్చు.

యూఎస్ లో ఈ సినిమాకు ఎలాంటి కత్తెరలు పడలేదు. ఇక ఇలాంటి సినిమాలకు యూఎస్ లో ఈ రేంజ్ లో సక్సెస్ అవడం గొప్ప విషయం. మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ యూఎస్ లో 7 లక్షల డాలర్లు వసూలు చేసింది. అర్జున్ రెడ్డి మూడు రోజుల్లోనే ఈ మార్క్ అందుకుంది. విజయ్ నటించిన పెళ్లిచూపులు సినిమా కూడా యూఎస్ లో 50 రోజులు ఆడించారంటే ఇక అక్కడ విజయ్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

రిలీజ్ ముందు యాంటీ ప్రమోషన్స్ తో పబ్లిక్ లోకి వెళ్లిన ఈ అర్జున్ రెడ్డి రిలీజ్ తర్వాత సరికొత్త రికార్డులతో సంచలనంగా మారింది. చూస్తుంటే ఈ సినిమా యూఎస్ లో 2 మిలియన్ మార్క్ అందుకునేలా కనిపిస్తుండగా టోటల్ రన్ లో సినిమా 30 కోట్లు వసూలు చేస్తుందని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news