Moviesరాజమౌళి మెచ్చిన అర్జున్ రెడ్డి.. విజయ్ జీవించేశాడు..!

రాజమౌళి మెచ్చిన అర్జున్ రెడ్డి.. విజయ్ జీవించేశాడు..!

తనకు నచ్చిన సినిమా గురించి ఎలాంటి భేషజాలు లేకుండా చెప్పే రాజమౌళి ఇటీవల రిలీజ్ అయి సంచలనాలు సృష్టిస్తున్న అర్జున్ రెడ్డి సినిమా గురించి తన మాటల్లో ప్రశంసలు కురిపించాడు. అర్జున్ రెడ్డి చూశాను ప్రేమకథలు తీయడం నా వల్ల కాదు.. అయినా సరే ఈ సినిమాను పొగడకుండా ఉండలేను. సినిమాలో విజయ్ దేవరకొండ జీవించేశాడు. సినిమాకు పనిచేసిన కాస్ట్ అంతా బాగా నటించారు. డైలాగ్స్ బాగున్నాయి. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా దర్శకుడు సందీప్ రెడ్డికే ఇస్తున్నాను అంటూ అర్జున్ రెడ్డి మీద తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు రాజమౌళి.

ఇంతటి ఘన విజయం సాధించిన సినిమా యూనిట్ అంతటికి తన అభినందనలు తెలియచేశాడు రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమాపై సెలబ్రిటీస్ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. సినిమా కలక్షన్స్ ఓ రేంజ్ లో ఉండగా పొగుడుతున్న సెలబ్రిటీస్ సంఖ్య పెరగడంతో అర్జున్ రెడ్డి ఇంకా వసూళ్ల పరంగా దూసుకెళ్ళడం ఖాయమని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news