Moviesచడీ చప్పుడు లేకుండా నాని 'మజ్ను' బాగానే కలెక్ట్ చేశాడు!!

చడీ చప్పుడు లేకుండా నాని ‘మజ్ను’ బాగానే కలెక్ట్ చేశాడు!!

మినిమం గ్యారంటీ హీరో నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ మజ్ను సినిమా విడుదలైన తొలి రోజుల్లో బాగానే సందడి చేసినా, ఆ తర్వాత వచ్చిన నాగచైతన్య ప్రేమమ్, పూరి, కళ్యాణ్ రామ్ ల ఇజం మరియు మిగతా సినిమాల తాకిడికి కొంత వెనుక పడ్డట్లు అనిపించింది.కానీ నాని మాత్రం తన హిట్ ట్రాక్ కంటిన్యూ చేస్తూ మజ్ను తో ఈ సంవత్సరంలో హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడు.

దసరా హాలిడేస్ కి ముందు వచ్చిన మజ్ను సినిమాలో కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్టైన్మెంట్ ఉండటంతో బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా బాగానే చాటాడు.నానికి జోడీగా కొత్త అమ్మాయిలు అను ఇమాన్యుయేల్, ప్రియాశ్రీలు నటించగా.. ఉయ్యాల జంపాల డైరెక్టర్ విరించి వర్మ డైరెక్షన్ లో వచ్చిన మజ్ను సినిమా కి తెలుగు ప్రేక్షకులు విజయాన్నే అందించారు.

ఇక ఇప్పటివరకు అందిన ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మజ్ను సినిమా ఏరియాల వారీగా కలెక్షన్ల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

నైజాం: 4.70 కోట్లు
సీడెడ్: 1.55 కోట్లు
వైజాగ్: 1.60 కోట్లు
ఈస్ట్: 1.13 కోట్లు
వెస్ట్: 88 లక్షలు
కృష్ణా: 81 లక్షలు
గుంటూరు: 95 లక్షలు
నెల్లూరు: 40 లక్షలు

తెలుగు రాష్ట్రాల నుంచి 12.02 కోట్లు

యూఎస్ఏ: 1.53 కోట్లు
కర్నాటక: 1.20 కోట్లు
ఇతర ప్రాంతాల నుంచి 55 లక్షలు వసూలయ్యాయి.

మొత్తంగా 15.3 కోట్ల షేర్ ను మజ్ను సినిమా రాబట్టి నాని తన హిట్ ట్రాక్ ని కంటిన్యూ చేస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news