Moviesఅప్పుడు విశ్వక్ సేన్.. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ.. తారక్ ఈ ఇద్దరు...

అప్పుడు విశ్వక్ సేన్.. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ.. తారక్ ఈ ఇద్దరు హీరోలను సపోర్ట్ చేయడానికి కారణం అదేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ .. టాలెంట్ ఉన్న హీరోలను ఎంకరేజ్ చేయడం చాలా చాలా రేర్.. చాలా అరుదుగా చూస్తూ ఉంటాం .. పెద్ద పెద్ద పాన్ ఇండియా హీరోలు సినిమాలకు కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ అందుకొని ..అకౌంట్లో బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేస్తూ ఉండడం తప్పిస్తే .. టాలెంట్ ఉన్న హీరోలను ఎంకరేజ్ చేయరు . కొంతమంది అది తెలిసి వాళ్లను సహాయం అడగకుండా వదిలేస్తారు.. మరి కొంతమంది అడిగినా చేయరు అంటూ స్ట్రైట్ గానే కోప్పడుతూ ఉంటారు.

అయితే ఇండస్ట్రీలో టాలెంట్ చూసి ఎంకరేజ్ చేసే హీరోలు కూడా ఉన్నారు అంటూ ప్రూవ్ చేశాడు ఎన్టీఆర్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విశ్వక్ సేన్ ను.. జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉంటారో.. ఆయన సినిమాలకు ప్రమోషన్ విషయంలో ఎలా హెల్ప్ చేస్తూ ఉంటారో..మనం చూశాం. ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డకు సైతం అదే విధంగా హెల్ప్ చేస్తున్నాడు .

రీసెంట్గా ఆయన నటించిన టిల్లు స్క్వేర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ క్రమంలోనే టీం ఇంటికి పిలిచి బిగ్ పార్టీ ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా టిల్లు స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు . ఇదే విషయాన్ని టీం అఫీషియల్ గా ప్రకటించింది . దీంతో ఎందుకు విశ్వక్ సేన్ -సిద్ధు జొన్నలగడ్డకు మాత్రమే ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తున్నాడు అన్న విషయం వైరల్ గా మారింది. కేవలం ఇద్దరి హీరోలకు మాత్రమే కాదని .. టాలెంట్ ఉండి.. సినిమా ఇండస్ట్రీ విలువలను గౌరవించే ప్రతి హీరోను ఎంకరేజ్ చేస్తాడు తారక్ అంటూ నందమూరి ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news