Moviesకలలో కూడా ఊహించని ఆఫర్ ని పట్టేసిన ప్రశాంత్ వర్మ .....

కలలో కూడా ఊహించని ఆఫర్ ని పట్టేసిన ప్రశాంత్ వర్మ .. ప్రభాస్ ని మించిపోయే స్టార్ తో సినిమా ఫిక్స్..!

ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతున్న పేరు . ఓ రాజమౌళి.. ఓ సుకుమార్ .. ఓ ప్రశాంత్ నీల్.. తర్వాత ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్న డైరెక్టర్ పేరు ఈయనదే కావడం గమనార్హం . హనుమాన్ సినిమాతో ఏకంగా స్టార్ పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయిన ప్రశాంత్ వర్మ.. లైన్ అప్స్ ఏ విధంగా ఉన్నాయో మనకు తెలిసిందే.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా బిగ్ సిరీస్తోనే మన ముందుకు రాబోతున్నాడు . దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో మనం ఎక్కువగా వింటున్నాం . అదేవిధంగా చూస్తున్నాము. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ప్రశాంత్ వర్మ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అండ్ బిగ్ అనౌన్స్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ నెట్టింట వైరల్ గా మారాయి .

బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న రన్వీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . రన్వీర్ సింగ్ కి బాలీవుడ్ లో ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. ప్రభాస్ ని మించి పోయే రేంజ్ లో అక్కడ జనాలు ఆయనను ఆరాధిస్తూ అభిమానిస్తూ ఉంటారు .

మరి అలాంటి హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా అంటే కచ్చితంగా అది రికార్డులు బద్దలు కొట్టడం కాదు ..ఉతికి ఉతికి ఆరేస్తుంది . అలాంటివో ప్రాజెక్ట్ ని తెరకెక్కించబోతున్నాడు ప్రశాంత్ వర్మ అంటూ ఆయన ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు. చూద్దాం ఈ అవకాశాని ఆయన ఎలా ఉపయోగించుకుంటారో..???

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news