Moviesరామ్ చరణ్ కు తాతగా ఆ స్టార్ హీరో నా..? ఇదేం...

రామ్ చరణ్ కు తాతగా ఆ స్టార్ హీరో నా..? ఇదేం కాంబో బుచ్చిబాబు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ రీసెంట్ గా కమిట్ అయిన సినిమా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే మూవీ . ఈ సినిమా ప్రజెంట్ సెట్స్ పై ఉంది . రీసెంట్ గానే పూజా కార్యక్రమాలు ఘనంగా జరుపుకున్నింది. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తుంది. రెండవ హీరోయిన్గా బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

ఇలా బ్యాక్ టు బ్యాక్ కీలక అప్డేట్స్ తో సోషల్ మీడియాలో నెంబర్ వన్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న ఆర్సి 16 మూవీ హ్యాష్ ట్యాగ్స్ ఇప్పుడు మరింత స్థాయిలో ట్రెండ్ అయ్యేలా ఓ న్యూస్ వైరల్ గా మారింది . ఈ సినిమాలో రామ్ చరణ్ కు తాత పాత్రలో అమితాబచ్చన్ నటించబోతున్నారట. బాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ బి అమితాబ్ కు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

అలాంటి హీరో ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో తాత పాత్రలో కనిపించబోతున్నాడు అనేసరికి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆశ్చర్యపోతున్నారు. మరి కొంతమంది మాత్రం తాత పాత్రలో ఏంటి అంటూ మండిపడుతున్నారు. కొందరు ఇదేం కాంబో రా బుచ్చిబాబు అంటూ ఫైర్ అవుతున్నారు . చూడాలి మరి బుచ్చిబాబు సనా ఐడియాలజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో..?

ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. అమితాబచ్చన్ ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారు . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news