Moviesఆరు నూరైనా..నూరు 150 అయినా.. అది జరగాలంటే వాళ్ళ తాతలు ముత్తాతలు...

ఆరు నూరైనా..నూరు 150 అయినా.. అది జరగాలంటే వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా దిగి రావాల్సిందే..!!

పుష్ప2 ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు మారుమ్రోగిపోతుంది . కేవలం కొద్ది గంటలే ఈ సినిమాకి సంబంధించిన బిగ్ సర్ప్రైజ్ ను రివిల్ చేయబోతున్నారు మేకర్స్. ఏప్రిల్ 8వ తేదీ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాకి సంబంధించి అద్దిరిపోయే క్రేజీ అప్డేట్లు రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీగా ఉన్నారు. కౌంట్ డౌన్ ప్రారంభమంటూ కూడా హింట్ ఇచ్చేశారు.

ఇలాంటి మూమెంట్లోనే పుష్ప సినిమాకి సంబంధించి ఫ్యాన్స్ బోల్డ్ గా స్పందిస్తున్నారు. చాలామంది పుష్ప రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూషన్ గా ఉన్నారు. కొంతమంది కల్కి సినిమా ఆగస్టులో రిలీజ్ అయితే ప్రభాస్ కోసం పుష్ప గాడు వెనక్కి తగ్గక తప్పదు అంటూ ప్రచారం చేశారు . కానీ ప్రభాస్ కల్కి సినిమా మే 30వ తేదీ రిలీజ్ అవ్వాలని ఫిక్స్ అయింది . ఈ క్రమంలోనే పుష్పరాజ్ రిలీజ్ డేట్ ను మరోసారి కన్ఫామ్ చేశాడు.

రష్మిక బర్త్డ డే సందర్భంగా పుష్ప2 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా రిలీజ్ అవ్వడం పక్క అంటూ రిలీజ్ డేట్ మరోసారి కన్ఫర్మ్ చేశారు . దీంతో అల్లు అర్జున్ ఫాన్స్ ఓ రేంజ్ లో రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమాపై ఎవరైతే నెగటివ్గా ప్రచారం క్రియేట్ చేస్తున్నారో.. వాళ్ళు ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారు ..అది జరగాలంటే అలా ట్రోల్ చేసే వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా దిగి రావాల్సిందే అంటూ ఓ రేంజ్ లో ఘాటుగా స్పందిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news