Moviesమెగాస్టారా మజాకా.. త్రిషకు అద్దిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. ఏంటో మీరే...

మెగాస్టారా మజాకా.. త్రిషకు అద్దిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. ఏంటో మీరే చూడండి..!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హ్యూజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు . ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు స్టార్ హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . మరీ ముఖ్యంగా సీనియర్ హీరో అయినప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా కొత్త కథలను ట్రై చేస్తూ జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాడు చిరంజీవి .

దీనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే . ప్రజెంట్ ఆయన నటిస్తున్న సినిమా విశ్వంభర. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై జనాలకు హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి . మెగా అభిమానులు ఓ రేంజ్ లో ఈ సినిమాపై ఆశలు పెంచేసుకుంటున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటిస్తుంది . రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా త్రిష తనకు చిరంజీవి గిఫ్ట్ ఇచ్చాడు అన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చింది .

“ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసే ఒక వాటర్ మగ్ గిఫ్ట్ గా ఇచ్చాడు చిరంజీవి “.. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది త్రిష . ఇది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ నాకు అవసరమైన గిఫ్ట్ ఇచ్చారు థాంక్యూ చిరు సార్ అంటూ ఎంతో ప్రేమగా ఫోటోలు షేర్ చేసింది . సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ గిఫ్ట్ పట్ల మెగా అభిమానులు ఫుల్ సాటిస్ఫై అయిపోతున్నారు . మెగాస్టార్ చిరంజీవి అంటే అంతే .. అన్ని విషయాలల్లో చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news