Moviesఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే కల్కి సినిమా అట్టర్ ప్లాఫే.....

ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే కల్కి సినిమా అట్టర్ ప్లాఫే.. సాహో కి మించిన డిజాస్టర్ అవుతుందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా కల్కి 2898 ఏడి. సినీ చరిత్రలోనే సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న మూవీ ఇది కావడం గమనార్హం. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్వీన్ ఈ సినిమాను తెరకెక్కించారు. గతంలో మహానటి సినిమాను తెరకెక్కించింది కూడా ఈ డైరెక్టర్ అని మనం మర్చిపోకూడదు. ఈ సినిమాలో దిశా పటాని – దీపికా పదుకొనే హీరోయిన్లుగా నటిస్తున్నారు . కీలక పాత్రల్లో అమితాబచ్చన్ – కమల్ హాసన్ కనిపించబోతున్నారు .

కాగా ఈ సినిమా మే తొమ్మిది న రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది చిత్ర బృందం. వైజయంతి మూవీస్ కి మే 9వ తేదీ ఏ విధంగా కలిసొస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ బ్యానర్లో తెరకెక్కిన మే 9న రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది . అయితే అదే హిట్ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్న వైజయంతి మూవీస్ వాళ్లకు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు బిగ్ షాక్ ఇచ్చాయి. మే 13వ తేదీ ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు.. మే 9వ తేదీ సినిమా రిలీజ్ చేస్తే చాలా చాలా టఫ్ సిచువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది.

ఈ క్రమంలోనే చిత్ర బృందం ఆలోచించి వెనకడుగు వేసింది . జూన్ 27వ తేదీ ఈ సినిమాను రిలీజ్ చేస్తాము అంటూ అఫీషియల్ గా ప్రకటించింది. అయితే ఒకవేళ ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది అంటున్నారు జనాలు . మే 9వ తేదీ రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఆ సెంటిమెంట్ కోసమే ఇన్నాళ్లు వెయిట్ చేసి ఆ తేదీని లాక్ చేసుకున్నారు. ఇప్పుడు ఊహించని పరిణామాలతో ఆ సినిమా డేట్ వెనక్కి వెళ్ళిపోయింది . ఇక హిట్ అవుతుందో..? ఫట్ అవుతుందో..? సినిమా అంటూ కొందరు వెటకారంగా ట్రోల్స్ చేస్తుంటే.. కధ.. కంటెంట్ ఉంటే ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసిన హిట్ అవుతుంది అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి కల్కి సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news