Moviesఓరి దేవుడోయ్ .. విజయ్ దేవరకొండకి ఏమైంది..? ఇంత పెద్ద రిస్క్...

ఓరి దేవుడోయ్ .. విజయ్ దేవరకొండకి ఏమైంది..? ఇంత పెద్ద రిస్క్ చేస్తున్నాడే.. తేడా వస్తే చేతిలో చిప్పే..!

ఇది విన్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ కు ఏమైంది..? ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు..? అంటూ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు. విజయ్ దేవరకొండ సినిమాలు అంటే ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు అభిమానులు . ఓ అర్జున్ రెడ్డి .. ఓ గీతా గోవిందం ఈ టైప్ ఆఫ్ జోనర్ సినిమాలను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . అయితే తాజాగా విజయ్ దేవరకొండ నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్ . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది .

పూర్తి ఫ్యామిలి సెంటిమెంట్ డ్రామా కావడం .. పైగా విజయ్ దేవరకొండ స్థాయికి ఈ సినిమా రీచ్ కాకపోవడంతో ఫ్యాన్స్ ఈ సినిమాని ఫ్లాప్ చేసేసారు . ఈ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ కూడా డీప్ గా హర్ట్ అయ్యారు. కాగా ఇప్పుడు అందరి ఆశలు విజయ్ తిన్నూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించబోతున్న సినిమా పైనే ఉన్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫుల్ టు ఫుల్ యాక్షన్ సినిమాగా తెరకెక్కబోతుందట . ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారట . నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ తలచుకుంటే ఏమైనా చేయగలడు అనే రేంజ్ లో స్క్రిప్ట్ ఉండబోతుందట .

అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఒక్కటంటే ఒక్క పాట కూడా ఉండడం లేదట . జనరల్గా సినిమాలో పాటలు హిట్ అయ్యి సినిమాకి పాజిటివ్ తీసుకొచ్చిన మూమెంట్స్ కూడా ఉన్నాయి . విజయ్ దేవరకొండ సినిమా అంటే పాటలను ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు అభిమానులు. మరి అలాంటిది ఈ సినిమాలో ఒక్క పాట కూడా లేకుండా ఎలా విజయ్ దేవరకొండ హిట్టు కొడతాడా ..? డౌటే అంటున్నారు జనాలు. అసలు విజయ్ దేవరకొండ ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నాడు ..అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది . తేడా వస్తే చేతిలో చెప్పే అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news