Moviesవాళ్ల నోర్లు మూయించడానికే బన్నీ అలాంటి నిర్ణయం తీసుకున్నాడా..? ఇక మీ...

వాళ్ల నోర్లు మూయించడానికే బన్నీ అలాంటి నిర్ణయం తీసుకున్నాడా..? ఇక మీ కళ్లు చల్లబడ్డాయా రా..?

పనీపాట లేని ప్రతి వెధవకి బన్నీ పైనే కళ్ళు.. ఆయన కెరీర్ని పతనం చేయడానికి చాలామంది ట్రై చేస్తున్నారు..యస్ ఇప్పుడు ఆయన అభిమానులు ఫుల్ యాంగ్రీ గా కోపంగా మాట్లాడుతున్నారు . మనకు తెలిసిందే ఎక్కడ పొగిడే వాళ్ళు ఉంటారు అక్కడే తిట్టేవాళ్ళు ఉంటారు .. ఎక్కడ మంచి ఉంటుందో అక్కడే చెడు ఉంటుంది .. ఎక్కడ పాజిటివిటీ ఉంటుందో అక్కడే నెగెటివిటీ కూడా ఉంటుంది ..కాగా ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్నారు బన్నీ ఫాన్స్ . సోషల్ మీడియాలో బన్నీకి సంబంధించి ఎలాంటి ట్రోలింగ్ జరుగుతుందో మనం చూసాం.

మరీ ముఖ్యంగా పుష్ప సినిమా హిట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ట్రోల్ చేయడానికి చూస్తున్నారు . అయితే బన్నీ ఫాన్స్ ఎప్పటికప్పటికీ ఇవ్వన్ని తిప్పికొడుతూ వస్తున్నారు . రీసెంట్ గా పుష్ప 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ అయింది . ఇది అంతా ఆశాజనికంగా లేదు . బన్నీ అభిమానులను సైతం డిసప్పాయింట్ చేసింది . అయితే ఇదే మూమెంట్లో మిగతా హీరో ఫ్యాన్స్ బన్నీ ను ఓ రేంజ్ లో ఆట ఆడేసుకున్నారు . ఈ సినిమా ఫ్లాప్ అవడం పక్క అని వ్యంగంగా కౌంటర్స్ వేశారు .

కొంతమంది బన్నీకు అసలు 100 కోట్లు కూడా ఇవ్వడం వేస్ట్ అంటూ మాట్లాడారు . దీనితో తిక్కరేగిన బన్నీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఈ సినిమా కోసం 100 కోట్ల వరకే చార్జ్ చేయాలి అనుకున్న బన్నీ ఇప్పుడు ఏకంగా దాని 150 కోట్లు చార్జ్ చేశారట . 100 కోట్లు రెమ్యూనరేషన్ 50 కోట్లు షేరింగ్ ఇవ్వాలి అనే విధంగా అగ్రిమెంట్ను రెడీ చేయించుకున్నారట . ఎవరైతే తనని ట్రోల్ చేశారో వాళ్ళ నోర్లు మూయించడానికి బన్నీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో కొంతమంది బన్నీని సపోర్ట్ చేస్తుంటే మరి కొంతమంది మాత్రం ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు ఓ రేంజ్ లో బన్నీకి సంబంధించిన విషయాలను తవ్వి లోడి బయటకు తీస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news