Moviesమహేష్ బాబు పేరును తుడిచేయడానికి సిద్ధమవుతున్న బన్నీ.. ఘట్టమనేని ఫ్యాన్స్ కు...

మహేష్ బాబు పేరును తుడిచేయడానికి సిద్ధమవుతున్న బన్నీ.. ఘట్టమనేని ఫ్యాన్స్ కు టెన్షన్ పుట్టిస్తున్న లేటెస్ట్ న్యూస్..!

సినిమా ఇండస్ట్రీలో రికార్డులు ఎవ్వరి సొంతం కాదు .. ఒక హీరో రికార్డులు క్రియేట్ చేయడం మరొక హీరో ఆ రికార్డులను బ్రేక్ చేయడం సర్వసాధారణమైన విషయం.. ఇది ఇండస్ట్రీలో ఎప్పటినుంచో వస్తున్న తంతూ.. కేవలం ఒక హీరోనే కాదు ఎంతో మంది హీరోలు ఇలా రికార్డులు క్రియేట్ చేశారు. రికార్డులు బ్రేక్ కూడా చేశారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. మహేష్ బాబు లాస్ట్ గా నటించిన సినిమా గుంటూరు కారం . త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అట్టర్ ప్లాప్ టాక్ సంపాదించుకుంది .

అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం అభిమానులను సాటిస్ఫై చేసింది . ఈ సినిమా ధమ్ మసాలా సాంగ్ రిలీజ్ అయ్యి 24 గంటలలోనే అత్యధిక వ్యూస్ దక్కించుకున్న పాటగా యూట్యూబ్ రికార్డులు సృష్టించింది .అంతేకాదు .. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు బన్నీ . బన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా పుష్ప2.. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాబోతుంది . మే ఒకటవ తేదీ ఈ సినిమాకి సంబంధించిన సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ .

ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది . బన్నీ మహేష్ బాబు రికార్డ్ ని తుడిచేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . రీసెంట్గా ఈ పాటకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయితేనే సోషల్ మీడియాని షేక్ చేసేసారు బన్నీ ఫాన్స్. ఇక పూర్తి పాట రిలీజ్ అయితే మ్యాటర్ ఏ విధంగా స్పీడ్ అవుతుందో మనకు తెలిసిందే. దీంతో ఇప్పటివరకు మహేష్ బాబు పేరు పై ఉన్న అరుదైన రికార్డ్ మరికొద్ది రోజుల్లోనే బన్నీ పేరుపై రాబోతుంది . ఇదే విషయాన్ని కొందరు నార్మల్ గా చెప్తుంటే మరికొందరు ఘాటుగా ఘట్టమనేని ఫ్యాన్స్ హర్ట్ అయ్యే విధంగా చేస్తున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news