Moviesమహేశ్ కోసం రాజమౌళి దింపబోతున్న ఈ ఇండోనేషియా బ్యూటీ అంత తోపా..?...

మహేశ్ కోసం రాజమౌళి దింపబోతున్న ఈ ఇండోనేషియా బ్యూటీ అంత తోపా..? మన ఎన్టీఆర్ కి అంత క్లోజా..?

ప్రజెంట్ కోట్లాదిమంది అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో తెరకెక్కే మూవీ . టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తన సినిమాల కోసం ఎంత కష్టపడతాడో మన అందరికీ తెలిసిందే . రీసెంట్గా నటించిన గుంటూరు కారం సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది . త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లో మోత మోగించేసింది . అఫ్కోర్స్ సినిమాపై నెగటివ్ ట్రోలింగ్ జరిగిన సరే సినిమాపై హ్యూజ్ పాజిటివ్ కామెంట్స్ వినిపించాయి .

ప్రెసెంట్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం కష్టపడుతున్నాడు . ఈ సినిమా కోసం తన లుక్ ను కూడా మార్చేసాడు. ఎప్పుడు గడ్డంపెంచని మహేష్ బాబు.. రాజమౌళి సినిమా కోసం భారీ స్థాయిలో గడ్డం పెంచుతున్నాడు. ఈ ప్రతిష్టాత్మకమైన సినిమాలో హీరోయిన్ ఎవరు అయ్యి ఉంటారు అంటూ ఇన్నాళ్లు జనాలు చర్చించుకున్నారు జనాలు. రీసెంట్గా ఇంట్రెస్టింగ్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ప్రాజెక్టులో ఇండోనేషియా బ్యూటీ చైలిస్లియా ఇస్లాం నటించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ బ్యూటీ ఇండోనేషియా స్టార్ హీరోయిన్ అయినప్పటికీ టాలీవుడ్ లో నటించాలని ఇంట్రెస్ట్ ఉంది అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది . అంతేకాదు ఇన్స్టాల్ రాజమౌళి ని కూడా ఫాలో అవుతున్నారు . దీంతో ఈ బ్యూటీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . నిజానికి ఆర్.ఆర్.ఆర్. సినిమాలోనే ఈ బ్యూటీని ఎన్టీఆర్ కి హీరోయిన్గా చూస్ చేసుకున్నారట . కొన్ని అనివార్య కారణాల చేత ఆమెను తీసేసేయాల్సి వచ్చిందట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news