Moviesచిరంజీవి ఏమో త్రిష.. నాగార్జున ఏమో ఈ బ్యూటీ .. ముసలోలైన...

చిరంజీవి ఏమో త్రిష.. నాగార్జున ఏమో ఈ బ్యూటీ .. ముసలోలైన హీరోయిన్స్ ని భలే సెట్ చేసుకున్నారుగా..!!

ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోస్ కి హీరోయిన్స్ దొరకడం చాలా కష్టంగా మారింది . అలా అని ఓల్డ్ బ్యూటీస్ ని తీసుకోలేరు.. అలా అని యంగ్ కుర్ర బ్యూటీస్ ను తమ సినిమాలో పెట్టుకుని రొమాన్స్ చేయలేరు . దీంతో సీనియర్ హీరోస్ కు హీరోయిన్స్ తో పెద్ద చిక్కే వచ్చి పడింది . రీసెంట్గా సోషల్ మీడియాలో మరొక వార్త వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి తాజాగా నటిస్తున్న సినిమా విశ్వంభర.

వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష ను చూస్ చేసుకున్నారు మేకర్స్ . అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . అయితే ఇప్పుడు నాగార్జున కూడా చిరంజీవిని ఫాలో అవుతూ తన సినిమాలో లక్కీ బ్యూటీ ని చూస్ చేసుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . నాగార్జున రీసెంట్ గానే నా సామిరంగా సినిమాతో హిట్ అందుకున్నాడు.

ఇప్పుడు శేఖర్ కమ్ముల – ధనుష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు . అంతేకాదు ఆ తర్వాత సుబ్బు అనే కొత్త దర్శకుడు తో కూడా సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియమణిని చూస్ చేసుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . గతంలో ప్రియమణి నాగార్జున కాంబోలో వచ్చిన సినిమాలు ఎలా అభిమానులను ఆకట్టుకున్నయో తెలిసిందే. మరోసారి క్రేజీ కాంబో రిపీట్ అవుతూ ఉండడంతో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . అంతేకాదు సీనియర్ హీరోస్ కి వయసు అయిపోయిన సరే హీరోయిన్స్ బాగానే దొరుకుతున్నారు అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news