Moviesసుమంత్ గోడ దూకడానికి ఏపీ సీఎం జ‌గ‌న్ ఏం చేశాడంటే.. వీరి...

సుమంత్ గోడ దూకడానికి ఏపీ సీఎం జ‌గ‌న్ ఏం చేశాడంటే.. వీరి ఫ్రెండ్‌షిఫ్ స్టోరీ తెలుసా..!

టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీకి ఓ ప్రత్యేకత ఉంది. వారితో కొందరు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఎన్.టి.ఆర్ కి ఏ ఎన్ ఆర్ కి ఎంతటి అనుబంధం ఉందో అందరికీ తెలిసిందే. ఒకదశలో పెద్దాయన ఈ చిన్నాయన్ని మీరు కూడా రాజకీయాలలోకి రావచ్చు కదా బ్రదర్..? అని కూడా అడిగిన సందర్భం ఉంది. కానీ, ఏ ఎన్ ఆర్ నుంచి ఇప్పటి అఖిల్ వరకూ ఎవరికీ రాజకీయాలలోకి రావాలనే ఆసక్తి లేదు.

ఇక అక్కినేని మేనల్లుడు సుమంత్ హీరోగా రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథ ద్వారా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సుమంత్ పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత సుమంత్ కి సత్యం మంచి క్రేజ్ ని తెచ్చింది. అయితే, అందరు మాస్ హీరోల మాదిరిగా సుమంత్ స్టార్ స్టేటస్ అందుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడనే చెప్పవచ్చు.

ఇప్పటికీ సుమంత్ ఒక సినిమా చేయాలంటే పూర్తిగా కొత్తదనం కోరుకుంటాడు. కొత్త వాళ్ళతో పనిచేయడానికి ఇష్టపడతాడు. ఇలాంటి ప్రవర్తన చూసి సుమంత్ చాలా ఇన్నోసెంట్ అని రిజర్వ్డ్ అని అనుకుంటారు. కానీ, అస్సలు కాదు, ఇప్పుడున్న ఏపి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుమంత్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఇంట్లో తాతయ్య, మావయ్యకి తెలీకుండా బాల్కానీ, కిటీకీలో నుంచి సుమంత్ ని ఇంట్లోకి పంపించేంత.

ఇద్దరు కలిసి రాత్రిళ్ళు సుమంత్ ఇంట్లో కలుసుకొవడం..సరదాగా ఎంజాయ్ చేయడం అలవాటట. దానికోసం ఇద్దరు ఇంటికి పదకొండున్నర తర్వాత ఇంటికి వచ్చేవారట. ఏ ఎన్ ఆర్ బెడ్రూం పైన సుమంత్ కి బెడ్రూం ఉండేదట. అది చేరుకోవాలంటే దొంగతనంగా జగన్ కింద ఉండి సపోర్ట్ చేస్తే సుమంత్ ముందు తన రూంలోకి చేరుకునేవాడట. ఆ తర్వాత జగన్ వెళ్ళేవాడట. ఇలా కొంతకాలం ఎంజాయ్ చేశారని స్వయంగా సుమంత్ చెప్పుకొచ్చాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news