Movies"రాజా సాబ్" సినిమాతో ప్రభాస్ రియల్ లైఫ్ కి ఉన్న కనెక్షన్...

“రాజా సాబ్” సినిమాతో ప్రభాస్ రియల్ లైఫ్ కి ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా..? మారుతి భలే పాయింట్ పట్టేసాడుగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా రాజా సాబ్. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నట్లు ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతుంది. రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ పాత్ర ఆయన నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందట .

ఈ సినిమాలో ప్రభాస్ భీమవరం అబ్బాయిగా కనిపించబోతున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో ఆయనకి ముగ్గురు చెల్లెలు ఉంటారట. అంతేకాదు ఈ సినిమాలో ఆయన ఒక లవ్ ఫెయిల్యూర్ గా కనిపించబోతున్నారట . ఈ సినిమాలో కూడా ఆయన తన రియల్ క్యారెక్టర్ కి మ్యాచ్ చేయాలా చాలా సైలెంట్ గా ఉండబోతున్నాడట. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన తన పెదనాన్న కృష్ణం రాజు క్యారెక్టర్ ని ఒక స్టార్ హీరోతో రీప్లేస్ చేయించబోతున్నాడట.

ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు చూద్దామా..? అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కాగా ఈ సినిమా కోసం ప్రభాస్ బాగా కష్ట పడుతున్నాడట. ప్రసెంట్ ఆయన నటించిన కల్కి సినిమా రిలీజ్ కి సిద్ధమవుతుంది. అంతేకాదు యానిమల్ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కూడా ప్రభాస్ ఓ సినిమా కి కమిట్ అయ్యాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news