Movies"సెన్సర్ వాళ్లతో గొడవపడి మరి ఆ డైలాగ్ పెట్టాను".. సందీప్ రెడ్డి...

“సెన్సర్ వాళ్లతో గొడవపడి మరి ఆ డైలాగ్ పెట్టాను”.. సందీప్ రెడ్డి వంగా బోల్డ్ కామెంట్స్ విన్నారా..?

సందీప్ రెడ్డి వంగ .. నిన్న మొన్నటి వరకు ఈ పేరు చెప్తే జనాలు అస్సలు గుర్తుపట్టే వాళ్ళు కాదు. కానీ అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఆయన పేరు స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి యాడ్ అయిపోయింది . అంతేకాదు ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన యానిమల్ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో సందీప్ రెడ్డివంగా పేరు మారుమ్రోగిపోతుంది . కాగా యానిమల్ సినిమా 900 కోట్లు కలెక్ట్ చేశాయి .

ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ పేరుని ఎక్కువగా తలచుకుంటున్నారు స్టార్ట్ డైరెక్టర్స్ . నాలుగు సంవత్సరాలకు ఒక సినిమా తీసిన సరే షేక్ చేసి పడేస్తాడు ఇండస్ట్రీని అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సందీప్ రెడ్డి వంగ యానిమల్ లోని బోల్డ్ డైలాగ్ పై క్లారిటీ ఇచ్చారు . ఈ సినిమాలో రణబీర్ చాలా చాలా బోల్డ్ డైలాగ్స్ చెప్తాడు. మరీ ముఖ్యంగా రష్మిక మందన్నాతో మాట్లాడుతూ..” నీకు పెల్వీస్ పెద్దగా ఉందని.. హెల్తీ బేబీస్ పుడతారు అని ..చెప్పడం జనాలకి కూడా థియేటర్స్ లో ఈ డైలాగు విన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది “.

అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురవగా సందీప్ రెడ్డివంగా సమాధానం ఇస్తూ ..”సెన్సార్ వాళ్ళు ఈ డైలాగ్ ని కట్ చేయాలని చూశారని .. కానీ నేనే గొడవ పడి మరి ఆ డైలాగు ను ఉంచానని .. ఒక అమ్మాయిని ఇష్టపడినప్పుడు మీ ముక్కు బాగుంది మీ పెదాలు బాగున్నాయి మీ కళ్ళు బాగున్నాయి అంటూ చెప్పకు వస్తామని .. బాడీలోని పార్ట్ నే గా పెల్విస్ అని మరి నీ పెల్వీస్ బాగుంది అని చెప్పడం తప్పు ఎలా అవుతుంది అని మీరు భయపడకండి.. సగం మంది జనాలకి ఆ పదం అర్థం కాదు అంటూ చెప్పి మరి సెన్సార్ వాళ్లకు ఈ డైలాగ్ ని కట్ చేయకుండా ఉంచారట “. ప్రజెంట్ ఇవే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news