Moviesఆ స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్.. శ్రీలీల మాములు డేంజర్...

ఆ స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్.. శ్రీలీల మాములు డేంజర్ పిల్ల కాదు మహా ముద్దురే..!!

ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ .. తర్వాత నితిన్ ఎంతో ఇష్టంగా చేస్తున్న సినిమా వెంకీ కుడుముల దర్శకత్వంలో మూవీనే కావడం గమనార్హం. ఛలో , భీష్మ సినిమాలతో తన ఖాతాలో భారీ విజయాలను నమోదు చేసుకున్న వెంకీ కొడుముల దర్శకత్వంలో నితిన్ మరో సినిమా హీరోగా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది .

ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో ఊర్వశి రాతేలా నటించబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో క్రేజీ క్రేజీ స్టెప్స్ కూడా వేయబోతున్నాడట నితిన్. ఇంతవరకు తన కెరియర్లో చేయని స్టెప్స్ కూడా ఈ మూవీలో చేయబోతున్నాడట. హిట్ కోసం తాపత్రయపడుతున్న నితిన్ ఏదైనా చేయడానికి రెడీ అవుతున్నాడు అన్న న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ సినిమాలో శ్రీలీల కూడా మాస్ స్టెప్స్ ఇరగదీయ్యబోతుందట .

ధమాకా , గుంటూరు కారం సినిమాలకు మించి ఈ సినిమాలో మాస్ నెస్ ని చూపించబోతున్నాడట డైరెక్టర్. మొత్తానికి ఛలో – భీష్మ సినిమాలోని ఫన్ కంటే ఈ సినిమాలో ఇంకా మాస్ ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది అంటూ హింట్ ఇచ్చేశాడు వెంకీ కుడుములు . చూద్దాం మరి సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..? ఈ సినిమాలో మొదట గా రష్మిక ను అనుకున్నారు కానీ ఆమె తప్పుకోవడంతో శ్రీలీల లైన్లో కి వచ్చింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news