Moviesహనుమాన్ 2 లో ఆ పాన్ ఇండియా హీరో.. ప్రశాంత్ వర్మ...

హనుమాన్ 2 లో ఆ పాన్ ఇండియా హీరో.. ప్రశాంత్ వర్మ గేమ్ మొదలు పెట్టాడుగా..!!

ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే తేజ సజ్జా నటించిన హనుమాన్ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా జనవరి 12వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా 100 కోట్ల కలెక్షన్స్ దాటేసి తేజ సజ్జా కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ ఈ సినిమాకి హైలెట్ అని చెప్పాలి . ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ పేరు పాన్ ఇండియా రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . కాగా ఈ చిత్రం రెండు భాగాలుగా రానున్న విషయం అందరికీ తెలిసిందే. చెప్పినట్లుగానే హనుమాన్ చిత్రం క్లైమాక్స్ లో హనుమాన్ 2 ను రిలీజ్ చేస్తూ జై హనుమాన్ అనే మరో సినిమాలో 2025లో రిలీజ్ చేయబోతున్నామంటూ ప్రశాంత్ వర్మ ప్రకటించాడు.

అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాలో రాముడు పాత్ర గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. హనుమాన్ పార్ట్ 2 లో రాముడు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి . ప్రశాంత్ వర్మ అడిగితే రామ్ చరణ్ కచ్చితంగా కాదు అనడు ..అందుకే ఈ సినిమాలో కచ్చితంగా ఆయన రాముడు పాత్ర పోషించే ఛాన్సెస్ ఉంటాయని ..అలా చేస్తే సినిమా వేరే లెవెల్ లో మారిపోతుందని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news