Moviesత్రివిక్రమ్ "గుంటూరు కారం" అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి .. కర్త-కర్మ-క్రియ ఎవరో...

త్రివిక్రమ్ “గుంటూరు కారం” అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి .. కర్త-కర్మ-క్రియ ఎవరో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అంటే ఇండస్ట్రీలో ఎలాంటి ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారో మనకు తెలిసిందే. అయితే అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ రావును ఇప్పుడు సోషల్ మీడియాలో జనాలు ఏకి పారేస్తున్నారు. అసలు ఇతగాడికి డైరెక్షనే రాదు అంటూ బూతులు తిడుతున్నారు . దాని అంతటికీ కారణం గుంటూరు కారం సినిమా అని అందరికీ తెలిసిందే.

ఈ డైరెక్టర్ రాసే కథలు చాలా బాగుంటాయని.. డైలాగులు మాటలు తూటాలుల పేలుతూ ఉంటాయని.. అందరూ అనుకుంటూ ఉంటారు. నువ్వు నాకు నచ్చావ్, చిరునవ్వుతో , మన్మధుడు , మల్లీశ్వరి వంటి హిట్ సినిమాలకు కథలు అందించి గొప్ప రైటర్ గా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఆ తర్వాత నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడుగా మారాడు . అతడు – జల్సా – ఖలేజా వంటి మూవీస్ తీసి సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు అన్ని సినిమాల్లో త్రివిక్రమ్ కి మంచి పేరు తెచ్చిపెట్టాయి.

అయితే గుంటూరు కారం సినిమా విషయంలో కథ బెడిసి కొట్టింది . త్రివిక్రమ్ ప్రముఖ తెలుగు రచయిత యద్దనపూడి సులోచనా రాని రాసిన నవలల ఆధారంగా కథలను కాపీ కొడుతూ తన సినిమాలను తెరకెక్కించారని ఇప్పుడు ఆమె చనిపోవడంతో ఆమె నవలలు రాకపోవడం వల్ల త్రివిక్రమ్ తన ఓన్ టాలెంట్ ఉపయోగిస్తున్నాడని .. అందుకే గుంటూరు కారం అలా తగలాడింది అని ..సినిమా ఫ్లాప్ అయింది అని ఫాన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news