Moviesఅమ్మ బాబోయ్.. మన మహేశ్ కి తమన్నా ఇంత క్లోజా..? మిల్కీ...

అమ్మ బాబోయ్.. మన మహేశ్ కి తమన్నా ఇంత క్లోజా..? మిల్కీ బ్యూటి మహిమ అలాంటిది..ఏం చేద్దాం..!!

మనకు తెలిసిందే.. మహేష్ బాబు చాలా రిజర్వ్డ్ గా ఉంటారు . తన పని తాను చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు . మిగతా వాళ్ల గురించి పెద్దగా ఆలోచించరు. తన జోలికి వస్తే మాత్రం చీల్చి చెండాడేస్తాడు. అలాంటి గట్స్ ఉన్న హీరో ఘట్టమనేని మహేష్ బాబు . కాగా మహేష్ బాబు చాలా తక్కువ మంది హీరోయిన్స్ తోనే చనువుగా మూవ్ అవుతూ ఉంటారు. వాళ్లలో ఒకరే తమన్నా.. వీళ్ళ కాంబోలో ఆగడు సినిమా వచ్చింది. ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుందో మనందరికీ తెలిసిందే .

ఆ తర్వాత సరిలేరు నీకెవరు సినిమాలో ఐటమ్ సాంగ్ లో ఇద్దరు కలిసి చిందులేసారు . ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు . ఆ తర్వాత ముచ్చటగా మూడోసారి మళ్లీ తమన్నా మహేష్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు . దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకునేది సినిమా కోసం అనుకుంటే పొరపాటే ..ఒక యాడ్ షూట్ కోసం ..

ఈ క్రమంలోనే వీరిద్దరి వర్కింగ్ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా చాలా సరదాగా నవ్వుతూ పలకరించుకోవడం మాట్లాడుకోవడం చూస్తుంటే వీళ్ళు ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ అని ఆశ్చర్యపోక తప్పదు . మహేష్ బాబు చాలా తక్కువ మంది హీరోయిన్స్ తోనే ఈ రేంజ్ ఫ్రెండ్షిప్ మైంటైన్ చేస్తూ ఉంటారు. దీంతో తమన్నా కూడా ఆ లిస్టులో ఉంది అని తెలిసిపోయింది. ప్రజెంట్ తమన్నా మహేష్ బాబు నవ్వుతూ వర్క్ చేస్తున్న వర్కింగ్ స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news