Moviesరెండో పెళ్లి పై సునీత సెన్సేషనల్ కామెంట్స్..సంచలనం రేపుతున్న పోస్ట్..!!

రెండో పెళ్లి పై సునీత సెన్సేషనల్ కామెంట్స్..సంచలనం రేపుతున్న పోస్ట్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ సునీతకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . హీరోయిన్స్ కి మించిపోయే అందంగా ఉండే ఆమె సింగర్ గా ఎన్నో అవార్డులను అందుకుంది. ఎన్నో సినిమాలకు డబ్బింగ్ చెప్పింది. అంతేకాదు ఆమె పాట పాడితే ఎటువంటి వారైనా సరే సర్ ప్రైజ్ అయిపోవాల్సిందే . అలాంటి చక్కటి గొంతు ఆమె సొంతం. సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఫేవరెట్ సింగర్ గా ఉండే సునీత చిన్నతనం నుండే చాలా కష్టాలు అనుభవించింది .

మరీ ముఖ్యంగా ఆమె ప్రేమ – పెళ్లి వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే . చిన్న ఏజ్ లోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న సింగర్ సునీత ఆ తర్వాత భర్త నుండి విడాకులు తీసుకుంది . ఆ తర్వాత చాలా కాలం సింగిల్గానే లైఫ్ ని లీడ్ చేస్తూ కష్టాలతో పిల్లలను పెంచింది . రీసెంట్ గానే సింగర్స్ సునీత మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని పెళ్లి చేసుకున్నింది. అప్పటినుంచి కూడా ఆమెపై ట్రోలింగ్స్ బాగా ఎక్కువగా మొదలయ్యాయి .

అయితే వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు సింగర్ సునీత . జనవరి 9 వీళ్ల పెళ్లి గ్రాండ్ గా జరిగింది. నిన్నటితో వీళ్ళ పెళ్లి అయ్యి మూడేళ్లు కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంగా సింగర్ సునీత చాలా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది . వాళ్ల పెళ్లి పిక్ ని షేర్ చేస్తూ..” నా లైఫ్ ని సంతోషంగా మార్చేసింది ఇదే” అంటూ ఆ పిక్ కింద క్యాప్షన్ ఇచ్చింది . ప్రస్తుతం సింగర్ సునీత పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!

1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news