Movies"తాట ఊడిపోతుందిరోయ్ జాగ్రత్తా”.. ఫస్ట్ టైం స్టేజీ పై రెచ్చిపోయిన మహేశ్...

“తాట ఊడిపోతుందిరోయ్ జాగ్రత్తా”.. ఫస్ట్ టైం స్టేజీ పై రెచ్చిపోయిన మహేశ్ బాబు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు తాజాగా నటించిన సినిమా “గుంటూరు కారం”. ఈ సినిమా మరో మూడు రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది . సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించారు మేకర్స్. గుంటూరు లో ఈ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. “నాకు తల్లిదండ్రులు లేరు మీరేనా తల్లిదండ్రులు” అని మాట్లాడటం చాలా చాలా ఆకట్టుకుంది . అంతే కాదు ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీలీల గురించి పొగిడేస్తూ ..”అమ్మ శ్రీ లీల నీ గురించి చెబుతున్నాను.. నిన్ను చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలాకాలం తర్వాత ఒక తెలుగు అమ్మాయి ఎంత పెద్ద హీరోయిన్ అవ్వడం ఇంకా హ్యాపీగా ఉంది.”

“నా కెరియర్ లో ఎంత కష్టపడే అమ్మాయిని చూడలేదు . తన సీన్ ఉన్నా లేకున్నా సెట్స్ లోనే ఉంటుంది . కార్ వ్యాన్ లోకి మాత్రం వెళ్ళదు . ఇక ఈ అమ్మాయితో డ్యాన్స్ చేయడం ..వామ్మో హీరోలందరికీ తోట ఊడిపోవాల్సిందే “అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది . అంతేకాదు మహేష్ బాబు ఈ రేంజ్ లో మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం అంటూ జనాలు పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news