Moviesగుంటూరు కారం ఫస్ట్ డే కలెక్షన్స్ : బాక్స్ ఆఫీస్ ఊచకోత...

గుంటూరు కారం ఫస్ట్ డే కలెక్షన్స్ : బాక్స్ ఆఫీస్ ఊచకోత కోసేసాడుగా మన రమణ గాడు.. మొదటి రోజే ఇన్ని కోట్లా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు తాజాగా నటించిన సినిమా గుంటూరు కారం . సర్కారి వారి పాట సినిమా తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని మరీ నటించిన సినిమా ఇదే కావడం గమనార్గం . అంతేకాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తనదైన స్టైల్ లో ఈ సినిమాను తెరకెక్కించాడు . శ్రీనివాసరావు సినిమాలల్లో కనిపించే అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో కనిపిస్తాయి. అదే ఇల్లు ..అదే ఫ్యామిలీ సెంటిమెంట్.. అదే మాస్ ..అదే డ్రామా అదే బావ మరదలు సరసం.. అదే మాస్ పాటలు.. అదేనాటి డైలాగ్స్ పెద్దగా చెప్పుకోవడానికి కొత్త ఎలిమెంట్స్ లేవు .

కానీ గుంటూరు కారం పై ముందు నుంచి హైప్ ఉండడంతో సినిమా ఫస్ట్ డే మాత్రం చాలా మంది జనాలు చూడడానికి ఈగర్ గా వెయిట్ చేసి మరి థియేటర్స్ కు వెళ్లారు . కాగా సోషల్ మీడియాలో గుంటూరు కారం ఫస్ట్ డే కి సంబంధించిన కలెక్షన్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. మొదటి నుంచి ఈ సినిమా . 50 కోట్లు కలెక్షన్ వస్తుంది అన్న కామెంట్స్ వినిపించాయి మహేష్ బాబు స్టామినా త్రివిక్రమ్ మార్కెట్ ప్రకారం ఈ సినిమా 50 కోట్లు దాటేస్తుంది అని రెండు రోజుల్లోనే 100 కోట్లు షేర్ రాబట్టేస్తుంది అని అంతా అనుకున్నారు .

కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి రోజు కేవలం 38.7 కోట్ల కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది . అంతేకాదు సెకండ్ డే ఈ లెక్క మరింత మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ గుంటూరు కారం కి నెగిటివ్ టాక్ వచ్చేసింది . హనుమాన్ సినిమాకి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . పైగా వెంకటేష్ నటించిన సైంధవ్ కూడా రిలీజ్ అయింది . సినిమా ఫ్యామిలీ యాక్షన్. అందరూ ఆ సినిమా చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరి గుంటూరు కారం సెకండ్ డే రిజల్ట్స్ ఎలా ఉంటాయో అంటున్నారు జనాలు..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news