Moviesవామ్మో .. సినిమాలో హనుమాన్ ఫేస్ రివిల్ చేయకపోవడం వెనుక ఇంత...

వామ్మో .. సినిమాలో హనుమాన్ ఫేస్ రివిల్ చేయకపోవడం వెనుక ఇంత పెద్ద రీజన్ ఉందా..? అందుకే ప్రశాంత్ వర్మ హిట్ కొట్టాడు..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమాకి సంబంధించిన టాక్ నే వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న తేజ సజ్జ .. తాజాగా నటించిన సినిమా హనుమాన్. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ షేక్ చేసి పడేసింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సోషల్ మీడియాని కుదిపేస్తుంది .

సినిమా ఇండస్ట్రీని గజగజ వణికించేస్తుంది . ఏకంగా 200 కోట్ల దాటేసి కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. అంతేకాదు ఈ చిత్రం గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమా అంతా బాగున్నప్పటికీ సినిమాలో ఎక్కడా కూడా ప్రశాంత్ వర్మ హనుమంతుడి ఫేస్ రివిల్ చేయలేదు. దీనిపై పెద్ద చర్చే నడిచింది . రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకి హాజరైన ప్రశాంత్ వర్మకు ఇదే ప్రశ్న ఎదురైంది .

దీంతో టాప్ సీక్రెట్ రివీల్ చేశాడు ప్రశాంత్ వర్మ . జై హనుమాన్ కథ అంత హనుమాన్ పాత్రతోనే సాగుతుంది . మొదట ఆ పాత్రలో ఎవ్వరిని చూపించాలని నిర్ణయించుకోలేదు.. అందుకే ఫేస్ చేయలేదు.. అయితే సీక్వెల్ లో మాత్రం ఫేస్ చూపిస్తాను.. ఆ పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్నారు.. అది ఖచ్చితంగా అభిమానులకి బిగ్ సర్ప్రైజ్ “అంటూ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఆంజనేయుడు పాత్రలో చిరంజీవి లేదా రానా దగ్గుబాటి నటించబోతున్నారట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news