Newsఎన్టీఆర్ - అల్లరి నరేష్ కాంబోలో మిస్ అయిన ఇండస్ట్రీ ట్రెండ్...

ఎన్టీఆర్ – అల్లరి నరేష్ కాంబోలో మిస్ అయిన ఇండస్ట్రీ ట్రెండ్ సెట్టర్ సినిమా ఏంటో తెలుసా..? ఎందుకు తారక్ రిజెక్ట్ చేశాడంటే..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలో సెట్ అయినట్లే సెట్ అయ్యి మిస్ అయిపోతుంటాయి . అలాంటి ఓ క్రేజీ రేర్ కాంబో ని ఎన్టీఆర్ – అల్లరి నరేష్ . ఎన్టీఆర్ పెద్ద హీరో అల్లరి నరేష్ ఇంకా హీరో స్టేటస్ కోసం ట్రై చేస్తున్నారు. వీళ్ళిద్దరి కాంబోలో సినిమా రావడానికి డైరెక్టర్ తెగ ట్రై చేశారట . భారీ స్థాయిలో ప్రయత్నాలు కూడా చేశారట . కానీ అది సక్సెస్ అవ్వలేదు. ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు? ఎందుకు వీళ్ళ కాంబోలో సినిమా రాలేకపోయింది..?? అనే విషయాలు ఇక్కడ చదివి తెలుసుకుందాం ..!!

అల్లరి నరేష్ లో ఎంత టాలెంట్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయన నటించే ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద జనాలకు నచ్చుతుంది. హిట్ ఫ్లాప్ అన్న విషయం పక్కనపెడితే కచ్చితంగా ఆయన సినిమాను చూసి నవ్వుకుంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన హిట్ కొట్టిందే లేదు … కొన్ని కొన్ని కాన్సెప్ట్లు ఆయన బాడీకి సూట్ అవ్వనివి చూస్ చేసుకుంటూ రిస్క్ చేస్తున్నాడు .

అయితే మహేష్ బాబు హీరోగా అల్లరి నరేష్ సెకండ్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మహర్షి . ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది . అయితే ఈ సినిమాల్లో ముందుగా వంశీ పైడిపల్లి మహేష్ బాబు రోల్ లో ఎన్టీఆర్ ని అనుకున్నారట . కథ కూడా వివరించారట . మంచి మెసేజ్ కాన్సెప్ట్ సినిమా కావడంతో తారక్ చేస్తే జనాలకు బాగా నచ్చుతుంది అంటూ చాలాసార్లు ట్రై చేశారట .

అయితే అప్పటికే వేరే సినిమాల్లో బిజీగా ఉన్న తారక్ ఈ సినిమా కోసం కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడు . తారక్ తో ఈ సినిమా తీయాలి అంటే మరో రెండు సంవత్సరాలు వెయిట్ చేయాలి .అంత టైం లేక వంశీ పైడిపల్లి ఆస్థానంలోకి మహేష్ బాబును తీసుకొచ్చారు . అలా తారక్- అల్లరి నరేష్ సినిమా మిస్సయింది .వీళ్ళ కాంబోలో ఒక్క సినిమా అయినా వస్తే బాగుండు అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి అభిమానుల కోరిక ఎప్పుడు తీరుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news