Moviesఆ డైరెక్ట‌ర్ లైఫ్ ఇచ్చినా తెలుగు హీరోయిన్‌... చేజేతులా కెరీర్ నాశ‌నం..!

ఆ డైరెక్ట‌ర్ లైఫ్ ఇచ్చినా తెలుగు హీరోయిన్‌… చేజేతులా కెరీర్ నాశ‌నం..!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇంద్రగంటి మోహనకృష్ణ ది ఓ డిఫరెంట్ మేకింగ్ స్టైల్. సినిమాను అందరూ మెచ్చేలా తీయాలని తాపత్రయపడతాడు. కమర్షియల్ సినిమా అంటే ఇలా కూడా తీయోచ్చా..? అని ఆలోచించుకునేలా ఆయన సినిమా కథలుంటాయి. గ్రహణం లాంటి ప్రయోగాత్మకమైన సినిమా తీయాలంటే చాలా గట్స్ కావాలి.

అది కూడా దర్శకుడిగా తీసే మొదటి సినిమా. ఆ తర్వాత తీసిన మాయాబజార్, అష్టా చమ్మ, దర్శకుడిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. కమర్షియల్ హిట్ కొట్టాలన్నా స్టార్ హీరోలు ఛాన్స్ ఇవ్వాలన్నా ఇలాంటి సినిమాలు సరిపోవు. జెంటిల్ మేన్, అంతకముందు ఆ తర్వాత, సమ్మోహనం, అమీ తుమీ, వి లాంటి సినిమాలు తీశాడు. ఇంద్రగంటి ఎక్కువగా హీరోయిన్స్ ని రిపీట్ చేశాడు.

వారిలో తెలుగమ్మాయి ఈషా రెబ్బ కూడా ఉంది. అంతకముందు ఆ తర్వాత, అమీ తుమీ చిత్రాలతో ఈషాకి మంచి సక్సెస్‌లు ఇచ్చాడు. కాఈ, ఈషా ఆ సక్సెస్‌లను వాడుకోవడంలో సెక్సెస్ కాలేదు. అరవింద సమేత లాంటి సినిమాలలో సెకండ్ లీడ్ ఇంకా చెప్పాలంటే ఈ రోల్ కి అసలు ప్రాధాన్యం ఉండదు. అలాంటి సినిమాలు చేసి తన కెరీర్ ని తనే నాశం చేసుకుంది.

ఈషా కి మంచి ఫిజిక్ పర్సనాలిటీ ఉంది. కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఇప్పుడున్న యంగ్ హీరోలందరితోనూ నాగార్జున లాంటి హీరోలతోనూ నటించే అవకాశాలు అందుకోవచ్చు. కానీ, తెలుగమ్మాయి కావడం..సరైన కథలను ఎంచుకోకపోవడం ఆమె కెరీర్ దెబ్బతినేలా చేశాయి. పైగా ఎక్కువగా ఇంద్రగంటి సినిమాల మీదే నమ్మకాలు పెట్టుకుంది. అలా ఒకరినే నమ్మితే కష్టం కదా. త్రివిక్రమ్‌ సినిమాలో ఎటూ చేసింది. ఆయన్నైనా గట్టిగా పట్టుకోవాల్సింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news