Newsస‌లార్ హైప్ అంతా ఢ‌మాల్‌.. చేజేతులా దెబ్బేసుకుంటున్నారుగా..!

స‌లార్ హైప్ అంతా ఢ‌మాల్‌.. చేజేతులా దెబ్బేసుకుంటున్నారుగా..!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు నేషనల్ హీరో అయిపోయాడు. ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు పబ్లిసిటీ ఒక రేంజ్‌లో ఉంటుంది. సౌత్ నుంచి నార్త్ వరకు నెలరోజులు ముందు నుంచే భారీ ఎత్తున పబ్లిసిటీ చేస్తున్నారు. అదిపురుష్‌, రాధేశ్యామ్ సినిమాల విషయంలో కూడా పబ్లిసిటీ కోసం ప్రభాస్ ఎంతో కష్టపడ్డాడు. దాదాపు నెల రోజుల నుంచి ఈ రెండు సినిమాలు కోసం భారీ ఎత్తున పబ్లిసిటీ చేశారు. ఇక సాహో సినిమాకు కూడా అంతే స్థాయిలో ప్రభాస్ ప్రమోషన్ల‌ కోసం కష్టపడ్డాడు.

ఇదంతా గతం. ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా సలార్.. కేజిఎఫ్ సిరీస్‌ సినిమాలతో బాగా పాపులర్ అయిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్ తెర‌కెక్కిస్తున్నాడు. ప్ర‌శాంత్ నీల్‌- ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న సలార్ సినిమాపై దేశవ్యాప్తంగా కనీవిని ఎరిగిన రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. సలార్‌ సినిమా మరో పది రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికీ ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. సినిమాలో రెండు పాటలు ఉన్నాయంటున్నారు. ఈ పది రోజుల్లో ఒక్క పాట అయినా మార్కెట్లోకి వస్తుందా అంటే సమాధానం లేదు.

అసలు ప్రమోషన్లు కర్ణాటకలో ఎప్పుడు చేస్తారు. టాలీవుడ్ లో ఎప్పుడు చేస్తారు ? అటు నార్త్ లో ఎప్పుడు చేస్తారు.. అన్నది క్లారిటీ లేదు. ఇవన్నీ అభిమానులను బాగా డిజ‌ప్పాయింట్ చేశాయి. పైగా ట్రైలర్ కూడా అంచనాలు అందుకోలేదు. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు సలార్ పై మరో ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ సినిమా పేరిట‌ రిలీజ్ ఫంక్షన్ కూడా ఉండదని అంటున్నారు. రెండో ట్రైలర్ రిలీజ్ చేసి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ వదిలేసి.. నేరుగా రిలీజ్ కి వెళతారని తెలుస్తోంది. దీనిపై కూడా క్లారిటీ లేదు.

ఇక ప్రభాస్ ప్రమోషన్లకు రాడ‌ని ప్రచారం జరుగుతుండగా.. చివరకు హీరోయిన్ శృతిహాసన్ తో కూడా ప్రమోషన్లు ప్లాన్ చేయలేదని తెలుస్తోంది. అసలు సలార్ చుట్టూ ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయి. సినిమా అనుకున్నట్టుగా రాలేదని.. అంచనాలు తగ్గించేందుకే యూనిట్ ఇలా చేస్తుందన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఏది ఏమైనా ఓ పాన్ ఇండియా సినిమాకు జరగాల్సిన రేంజ్‌లో ప్రచారం అయితే సలార్‌కు జరగటం లేదు అన్నది వాస్తవం. దీంతో రకరకాల సందేహాలు తలెత్తుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news