Newsమోక్ష‌జ్ఞ ముగ్గురు డైరెక్ట‌ర్లు రౌండ‌ప్‌... ఎవ‌రికి ఓకే చెప్పాలో తెలియ‌క బాల‌య్య...

మోక్ష‌జ్ఞ ముగ్గురు డైరెక్ట‌ర్లు రౌండ‌ప్‌… ఎవ‌రికి ఓకే చెప్పాలో తెలియ‌క బాల‌య్య తిక‌మ‌క‌…!

నందమూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ఏకైక వార‌సుడు నంద‌మూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై బాలయ్య అభిమానులు నాలుగైదేళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ.. తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీపై చాలాసార్లు స్పందించినా మోక్ష‌జ్ఞ ఎంట్రీ మాత్రం జ‌ర‌గ‌డం లేదు. మ‌రోవైపు మోక్ష‌జ్ఞ మాత్రం అమెరికాలో ఫైట్లు, డ్యాన్సుల్లో శిక్ష‌ణ తీసుకుంటున్నాడు.

ఇటు బాల‌య్య కూడా గ‌త రెండేళ్లుగా చాలా క‌థ‌లే వింటున్నాడు. అస‌లు ఏది ఫైన‌లైజ్ అయ్యిందో ఏ డైరెక్ట‌ర్‌కు ఓకే చెప్పాడో క్లారిటీ అయితే లేదు. ఇక నిర్మాత విష‌యంలోనూ రెండు మూడు పేర్లు లైన్లో ఉన్నా సాయి కొర్ర‌పాటి అంద‌రికంటే ముందుగా మోక్ష‌జ్ఞ‌కు అడ్వాన్స్ ఇచ్చారు. ఇది లెజెండ్ సినిమా టైంలో జ‌రిగింది. అందుకే మోక్ష‌జ్ఞ తొలి సినిమా అయితే బాల‌య్య లేక‌పోతే సాయి కొర్ర‌పాటి నిర్మాత‌లు కావొచ్చు. లేదా ఇద్ద‌రు క‌లిసి సంయుక్తంగా సినిమా తీసినా తీయ‌వ‌చ్చు.

ఇక డైరెక్ట‌ర్ విష‌యంలో ముగ్గురు డైరెక్ట‌ర్ల పేర్లు ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. బోయ‌పాటి శీను అఖండ 2తో పాటు మోక్ష‌జ్ఞ డెబ్యూ కోసం గ‌త నాలుగేళ్ల నుంచే ఓ క‌థ‌ను చెక్కుతూ వ‌స్తున్నారు. చిన్న చిన్న మార్పులు మిన‌హా బాల‌య్య కూడా ఓకే చెప్పారు. అయితే ఇప్పుడు బోయపాటి అఖండ 2 ప‌నిమీద బిజీగా ఉన్నారు. ఇక పూరి జ‌గ‌న్నాథ్ కూడా రెండు, మూడు క‌థ‌లు ప‌ట్టుకుని కొన్నాళ్లు బాల‌య్య చుట్టూ తిరిగాడు.

మ‌ధ్య‌లో ఏమైందో గాని పూరి విష‌యంలో మాటా మంచి లేదు. ఇక ఇప్పుడు కొత్త‌గా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ పేరు మోక్ష‌జ్ఞ డెబ్యూ సినిమా విష‌యంలో బాగా ప్ర‌చారంలోకి వ‌స్తోంది. త్రివిక్ర‌మ్‌తో స్క్రిప్ట్ గురించి బాల‌య్య‌ డిస్క‌ష‌న్స్ చేస్తున్నాడంటున్నారు. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ మ‌హేష్‌తో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. ఆ త‌ర్వాత బ‌న్నీతో సినిమా ఉంది.. మ‌రి మోక్ష‌జ్ఞ సినిమా ఎప్పుడు ఉంటుందో క్లారిటీ లేదు. ఏదేమైనా త‌న‌యుడు డెబ్యూ మూవీ విష‌యంలో బాల‌య్య ప్రొలాంగ్ చేయ‌కుండా త్వ‌ర‌గా తేల్చేస్తే మంచిద‌ని అభిమానులు కోరుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news